టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమే.. పొలిటికల్ ఎంట్రీ పై హైపర్ ఆది కామెంట్స్?

February 14, 2024

టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమే.. పొలిటికల్ ఎంట్రీ పై హైపర్ ఆది కామెంట్స్?

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో కమెడియన్ హైపర్ ఆది ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే హైపర్ ఆది వ్యక్తిగతంగా మెగా అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. మెగా కుటుంబాన్ని ఎవరైనా ఏదైనా అంటే ముందుగా రియాక్ట్ అవుతూ వారికి తన స్టైల్ లోనే సమాధానాలు చెబుతూ ఉంటారు.

ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని నేను ఆయనకు వీరాభిమాని అంటూ ఆది పలు సందర్భాలలో తెలిపారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి గత ఎన్నికలలో కూడా మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా జనసేన సభలకు వెళ్తూ అధికార ప్రభుత్వంపై మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలలో కూడా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇలా ఈయన జనసేన పార్టీకి మద్దతు తెలపడంతో ఎన్నికలలో పోటీ చేస్తారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి తాజాగా ఈయన పొలిటికల్ ఎంట్రీ గురించి స్పందించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంతో ఇష్టం ఆయనని వ్యక్తిగతంగా ఎవరిని దూషించరు. ఆయన సిద్ధాంతాలు నాకు నచ్చుతాయని అందుకే తనకు మద్దతు తెలుపుతానని తెలిపారు. ఈసారి ఎన్నికలలో కూడా తాను పార్టీ తరపున ప్రచారం చేస్తానని వెల్లడించారు.

తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు జబర్దస్త్ కార్యక్రమమే కారణమని తెలిపారు. ఇక రోజాతో నాకు విభేదాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి కానీ నాకు ఆమెతో ఎలాంటి విభేదాలు లేవని ఆమె జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నప్పుడు అందరినీ ప్రోత్సహించారు తప్ప ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ గెలవాలని నేను ఎంతగానో కోరుకుంటాను.

పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసం తనుకు టికెట్ ఇస్తే తాను కూడా ఎన్నికలలో నిలబడి గెలుస్తానని ఈ సందర్భంగా హైపర్ ఆది చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఆది ఈ కామెంట్ చేయడంతో టికెట్ ఇస్తే తాను తప్పకుండా గెలుస్తానని పరోక్షంగా పొలిటికల్ ఎంట్రీ గురించి ఆది చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈయనకు జనసేన అధినేత టికెట్ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read More: ఆ హీరోయిన్ నటన అంటే ఇష్టం.. తనతో అదే సమస్య: ప్రభాస్

ట్రెండింగ్ వార్తలు