January 5, 2022
MaheshBabu Praises Pushpa: మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌ల మధ్య ఉన్న వైరం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2018లో మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల విడుదల సమయంలో వీరిద్దరి మధ్య వైరంగా రాజుకుంది. ఎట్టకేలకు ముందుగా ‘భరత్ అనే నేను’ , ఆ తర్వాత ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ విడుదలైయ్యాయి. ఆ తర్వాత మళ్లీ 2020 సంక్రాంతి సమయంలో మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం, అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో…’చిత్రంతో బాక్సాఫీసు వద్ద పోటీపడ్డారు. అంతేకాదు..ఎవరికి వారు మా సినిమా హిట్ అంటే మా సినిమా హిట్ అంటూ ప్రచారం చేసుకు న్నారు. మా సినిమా సంక్రాంతి విన్నర్ అని ఒకరు, మా సినిమా సంక్రాంతి ఛాంపియన్ అని ఒకరు పోటీపడి మరీ యాడ్స్ వేయించారు. ఎవరి ఇష్టానికి వారు కలెక్షన్స్ పోస్టర్స్ దించారు. బన్నీ అండ్ టీమ్ అయితే ఒకడుగు ముందుకేసి అలవైకుంఠపురములో ఆల్ టైమ్ ఇండస్ట్రీహిట్(నాన్ బాహుబలి)అని ప్రెస్‌మీట్ పెట్టీ మరీ చెప్పుకున్నారు. అదే రోజు మహేశ్ అండ్ కో కూడా ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్(నాన్ బాహుబలి) అని పోస్టర్ రిలీజ్ చేశారనుకోండి అది వేరే విషయం.
Also Read: మంచు విష్ణు…మా బిల్డింగ్ ఎక్కడ?ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ సినిమా బాగుందని మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు. అయితే మహేశ్ ట్వీట్ చేసింది అల్లు అర్జున్‌పై ప్రేమతో కాదు.. ప్రస్తుతం మహేశ్‌బాబు చేస్తున్న ‘సర్కారువారిపాట’ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌ల కోసం అని తెలుస్తుంది. ఎందుకంటే మైత్రీ మూవీమేకర్స్ పతాకంపైనే ‘పుష్ప’ సినిమాను నిర్మించారు. నిజానికి ఈ ‘పుష్ప’ చిత్రం మహేశ్‌బాబు చేయాల్సింది. కానీ కుదర్లేదు. ఈ విషయంలోనే మహేశ్‌కు, సుకుమార్‌కు మధ్య గొడవలు వచ్చాయి. జరగాల్సిదంతా జరిగిపోయాక ఇప్పుడు మహేశ్ ట్వీట్ వేయడం ఏంటో లోగుట్టు పెరుమాళ్లకెరుక.