పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఎప్పడో తెలుసా?

April 24, 2024

పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఎప్పడో తెలుసా?

తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో పుష్ప 2 సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. దానికి తోడు పుష్ప 2 సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన టీజర్ ఆ అంచనాలను కాస్త మరింత పెంచేసింది. తాజాగా రిలీజైన టీజర్లో జాతర సెటప్‌లో సాగిన విజువల్స్ వావ్ అనిపించాయి.

గంగమ్మ అవతారంలో అల్లు అర్జున్ లుక్ మేనరిజమ్స్, యాక్ట్స్ తో దులిపేశాడు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా పుష్ప ది రూల్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. బుధవారం సాయంత్రం 4 గంటల ఐదు నిమిషాలకు ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పుష్ప పాటలు ఎంతగా క్లిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్లు, బన్నీ వేసిన స్టెప్పులు, రష్మిక, సమంత అప్పియరెన్స్ ఇవన్నీ కలిసి పాటల్ని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాయి. సుకుమార్, బన్నీ, దేవీ శ్రీ ప్రసాద్ కాంబోలో ఇప్పటి వరకు ఆల్ టైం బ్లాక్ బస్టర్ పాటలు వచ్చాయి. పుష్పతో మరోసారి వీరి కాంబో అదరగొట్టేసింది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాట ప్రోమోను రేపు సాయంత్రం విడుదల చేయబోతోన్నారు. ఇకపోతే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు మేమంతా అందుకోసమే వెయిటింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు

Read More: అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న మరో హీరోయిన్.. చైతూ బాటలోనే అఖిల్!

ట్రెండింగ్ వార్తలు