ఆ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ రియల్ కాదా… అంతా సీజీ ప్రభావమేనా?

April 19, 2024

ఆ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ రియల్ కాదా… అంతా సీజీ ప్రభావమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రామ్ చరణ్ ఒకరు. చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో తనని తాను నిరూపించుకున్నారు. అయితే ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోగా, గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ సినీ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవైనా ఉన్నాయి అంటే అందులో రంగస్థలం సినిమా కూడా ఒకటని చెప్పాలి. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ కు ఒక మైల్ స్టోన్ లాంటిదని చెప్పాలి. ఇందులో రామ్ చరణ్ చెవిటి అబ్బాయి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అందుకుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది అంటే ఒక స్టార్ హీరో ఎంట్రీలా కాకుండా ఒక సాధారణ వ్యక్తి సైకిల్ తొక్కుతూ వచ్చే విధంగానే రామ్ చరణ్ ఎంట్రీ కూడా ఉంటుంది అయితే ఒక స్టార్ హీరోని ఇలా ఇంట్రడ్యూస్ చేసే సమయంలో ప్రేక్షకులు ఎలా యాక్సెప్ట్ చేస్తారో అన్న భయం మీకు కలగలేదా అనే ప్రశ్న యాంకర్ నుంచి ఎదురైంది.

ఈ ప్రశ్నకు సుకుమార్ సమాధానం చెబుతూ ఈ కథ ఆధారంగా ఇంట్రడక్షన్ లోనే హీరో ఎలా రావాలి అంటే ఏదో ఒక వ్యక్తి కోసం వెతుకుతూ వాహనంపై వచ్చే వ్యక్తిలా ఉండాలి అప్పట్లో వాహనాలు అంటే సైకిల్ మాత్రమే కనుక రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అలాగే పెట్టామని తెలిపారు.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరకు కెమెరా రావాలి కనుక ఫ్లైయింగ్ కెమెరాలు ఉపయోగించాము అయితే ఫ్లయింగ్ కెమెరాలు ఉపయోగించి నాలుగు ఐదు టేకులు తీసుకున్న సరిగా సీన్ రాలేదు.

ఇలా అనుకున్న విధంగా రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో మేము రామ్ చరణ్ ఎంట్రీ సీన్ సీజీ చేశామంటూ ఈ సందర్భంగా సుకుమార్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. రామ్ చరణ్ సైకిల్ తొక్కుతున్నటువంటి వీడియోతో ఇలా క్రియేట్ చేసామని అయితే ఈ సినిమాలో చాలా చోట్ల ఈ విధంగా సీజీ వర్క్ చేసాము కానీ ప్రేక్షకులు ఎవరు గుర్తుపట్టలేదు అంటూ ఈ సందర్భంగా సుకుమార్ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Read More: Tillu Square OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన టిల్లు స్క్వేర్.. ఎప్పుడు ఎక్కడంటే?

ట్రెండింగ్ వార్తలు