మలయాళం లో రికార్డులు సృష్టిస్తున్న భ్రమ యుగం.. ఈనెల 23న తెలుగులో కూడా!

February 20, 2024

మలయాళం లో రికార్డులు సృష్టిస్తున్న భ్రమ యుగం.. ఈనెల 23న తెలుగులో కూడా!

వయసు 70 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఏమాత్రం తగ్గని ఎనర్జీతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు మమ్ముట్టి. వయసు భయపడుతున్న కొద్ది మరింత ఎనర్జిటిక్ గా పని చేస్తున్నారు. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం వచ్చేటట్టుగా కంటెంట్ అందరికీ నచ్చేటట్టుగా సినిమాలు తీస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఈమధ్య విడుదలవుతున్న మమ్ముటి చిత్రాలు అటు కంటెంట్ పరంగా హిట్ అవుతున్నాయి, ఇటు బాక్స్ ఆఫీస్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ ని అందుకుంటున్నాయి.

తాజాగా మమ్ముటి ప్రధాన పాత్రలో విడుదలైన భ్రమయుగం సినిమా మలయాళం లో రికార్డుల వర్షం కురిపిస్తుంది. సినిమాలోని వైవిద్య భరితమైన కథనానికి, మమ్ముట్టి అద్భుతమైన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కయని చిత్రవర్గాలు తెలిపాయి.రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన భ్రమయుగం సినిమా మిస్టీరియస్ థ్రిల్లర్ జానర్ లో ఉంటుంది. ఈ సినిమాకి సంగీతం క్రిస్టో జేవియర్ కాగా ఛాయాగ్రహణం షెహనాద్ జలాల్.

ఈ సినిమా ప్రజెంట్ ట్రెండ్ కి పూర్తి విభిన్నంగా బ్లాక్ అండ్ వైట్ లో విడుదల కావడం విశేషం.ఈ సినిమా దర్శకుడు రాహుల్ సదాశివన్ 2013లో రెడ్ రెయిన్ అనే స్కై- ఫై థ్రిల్లర్ ని తీసి హిట్టు కొట్టాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత భూతకాలం అనే సినిమాని విడుదల చేసి ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేశాడు. మళ్లీ ఇప్పుడు మమ్ముట్టి తో భ్రమయుగం సినిమాతో అందరినీ భయపెట్టిస్తున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి తన నట విశ్వరూపాన్ని చూపించారు.

17వ శతాబ్దపు బ్యాడ్ గ్రాఫ్ లో వచ్చిన ఈ సినిమా లో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ వంటి ప్రముఖులు నటించారు.ఇప్పటికే మలయాళంలో బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంటున్న భ్రమయుగం చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు చిత్ర బృందం. ఈనెల 23న థియేటర్ల లోకి రాబోతున్న భ్రమయుగం సినిమాని తెలుగు లో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విడుదల చేస్తున్నారు. మలయాళం లో బ్లాక్ బస్టర్ అయిన సినిమా తెలుగులో కూడా అంతే పేరు తెచ్చుకుంటుందని నమ్ముతున్నామని తెలిపింది చిత్ర బృందం.

Read More: బాత్రూంలో బికినీలో ఇలియానా.. మెమొరీ అంటూ బోల్డ్ ఫోటో షేర్ చేసిన గోవా బ్యూటీ?

ట్రెండింగ్ వార్తలు