నాగార్జునకు ఇలాంటి పాడు అలవాటు ఉందా.. ఆ అలవాటును మాన్పించిన అమల?

April 19, 2024

నాగార్జునకు ఇలాంటి పాడు అలవాటు ఉందా.. ఆ అలవాటును మాన్పించిన అమల?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సీనియర్ నటుడు నాగార్జున ఇప్పటికి యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. నాగార్జున ప్రస్తుతం ఆరుపదుల వయసు దాటుతూ ఉన్నప్పటికీ ఇంకా మన్మధుడుగానే అంతే చలాకీగా ఉంటూ ప్రేక్షకులను అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అయినటువంటి నాగార్జున వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు ఈయన మొదట శ్రీ లక్ష్మీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అయితే మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయి తిరిగి అమలను పెళ్లి చేసుకున్నారు అమల తన జీవితంలోకి వచ్చిన తర్వాత నాగార్జున లైఫ్ కూడా పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.

ఇక స్టార్ సెలబ్రిటీలు అయినప్పటికీ సాధారణ మనుషులు అయినప్పటికీ వారికంటూ కొన్ని అలవాట్లు ఉంటాయి. అయితే ఆ అలవాట్లు కొందరికి మంచిగా అనిపించవచ్చు మరికొందరికి చెడుగా అనిపించవచ్చు అలాంటి అలవాటే నాగార్జునకు కూడా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

నాగార్జున ఒకప్పుడు ప్రతిరోజు సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ ఉండేవారట కానీ అమల వచ్చిన తర్వాత ఆయన చేత పూర్తిగా మందు అలవాటు మానిపించలేక పోయిన ప్రతిరోజు తాగడం మాత్రం మాన్పించారని తెలుస్తోంది సోమవారం నుంచి శనివారం వరకు నాగార్జున ఫుడ్ విషయంలోనూ తన అలవాట్ల విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేలా అమలా చర్యలు తీసుకున్నారట.ఇక ఆదివారం మాత్రం తన ఫుడ్ విషయంలో ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవని తనకు నచ్చిన ఫుడ్ తీసుకుంటారట అలాగే ఆరోజు ఫుడ్ తో పాటు ఒక గ్లాస్ పెగ్గు కూడా వేస్తారని తెలుస్తోంది.

ఇలా ప్రతిరోజు పెగ్గులు పెగ్గులు వేసే నాగార్జునతో అమల ఇలా మందు మాన్పించారనే విషయం తెలిసి ప్రతి భర్తకు ఇలాంటి భార్య దొరకాలి అంటూ కామెంట్ చేస్తున్నారు మరి అమల నాగార్జున గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

Read More: చిరంజీవి వస్తున్నారని ఎయిర్ పోర్టుకు పరిగెత్తిన అభిమానులు.. కట్ చేస్తే సీన్ రివర్స్?

ట్రెండింగ్ వార్తలు