చిరంజీవి వస్తున్నారని ఎయిర్ పోర్టుకు పరిగెత్తిన అభిమానులు.. కట్ చేస్తే సీన్ రివర్స్?

April 19, 2024

చిరంజీవి వస్తున్నారని ఎయిర్ పోర్టుకు పరిగెత్తిన అభిమానులు.. కట్ చేస్తే సీన్ రివర్స్?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది కనుక అభిమానులు నేరుగా సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరో హీరోయిన్లతో మాట్లాడుతూ ఉన్నారు వారికి ఇష్టమైన ప్రశ్నలు అడుగుతూ వారిని నుంచి సమాధానాలు రాబడుతున్నారు కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు సెలబ్రిటీలతో మాట్లాడాలి అంటే వారిని ఎక్కడైనా సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నప్పుడే అది కూడా చాలా కష్టతరంగా అనిపించే ఇక వారి గురించి తెలుసుకోవాలంటే సినీ వార పత్రికలలో మాత్రమే తెలుసుకోవడానికి వీలుగా ఉండేది.

ఇలా ఒకప్పుడు సెలబ్రిటీలు ఎక్కడికైనా వస్తున్నారు అంటే వారికి ఎన్ని పనులు ఉన్నా మానుకొని ఆ హీరో హీరోయిన్లను చూడటం కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడే వారు. ఇప్పుడు కూడా కొన్ని చోట్లకూ సెలబ్రిటీలు వస్తున్నారంటే అదే స్థాయిలో అభిమానులు పరుగులు పెడుతున్నారు. అయితే ఓసారి మెగాస్టార్ చిరంజీవి ఎయిర్పోర్ట్ కు వస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నటువంటి అభిమానులకు తీవ్ర నిరుత్సాహం ఎదురైంది.

ఓసారి పద్మాలయ స్టూడియోలో ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత అభిమానులు తిరుగు ప్రయాణం చేశారు అయితే ఈ ప్రయాణంలో వారికి ఒక ఫోన్ సంభాషణ మాత్రమే వినపడింది. నువ్వు అక్కడే ఎయిర్ పోర్టులోనే ఉండు టికెట్స్ ఓకే అయ్యాయి కదా. సరే శరత్ బాబు గారు ఇక్కడ నుంచి ఎయిర్ పోర్టుకు వస్తారు. చిరంజీవి గారిని తీసుకొని నువ్వు అక్కడికి వచ్చేసేయ్ జాగ్రత్త అంటూ ఒక ఫోన్ సంభాషణ మాత్రమే వినపడింది. ఈ ఫోన్ సంభాషణ విన్నటువంటి అభిమానులు చిరంజీవి గారు ఎయిర్ పోర్ట్ కి వస్తున్నారు. మనం అక్కడికి వెళ్తే ఆయనని చూడవచ్చు తన ఆటోగ్రాఫ్ తీసుకోవచ్చు అని భావించిన అభిమానులు సరాసరి ఎయిర్ పోర్టుకు వెళ్లారు.

అక్కడ ఎంతో ఆతృతగా అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. శరత్ బాబు గారు వచ్చారు కానీ చిరంజీవి గారు మాత్రం అక్కడికి రాలేదు దీంతో అభిమానులు శరత్ బాబు గారు మీరే కదా మరి చిరంజీవి గారు వస్తారని చెప్పారు మరి ఆయన ఏరి అంటూ అభిమానులు ప్రశ్నించారు ఆ మాటకు శరత్ బాబు గారు పల్లున నవ్వి చిరంజీవి గారు వస్తారు అన్నమాట నిజమే అయితే ఈయన పేరే చిరంజీవి అని తన మేకప్ మెన్ అంటూ అసలు విషయం చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేశారు.

Read More: మిమ్మల్ని నా సినిమాలో తీసుకొని తప్పు చేశాను.. నటుడు పై సందీప్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు