మరోసారి ముంబైలో మెరిసిన తారక్.. వైట్‌ షర్ట్ జీన్స్ లో ఎన్టీఆర్‌ మాస్‌ అవతార్‌?

April 22, 2024

మరోసారి ముంబైలో మెరిసిన తారక్.. వైట్‌ షర్ట్ జీన్స్ లో ఎన్టీఆర్‌ మాస్‌ అవతార్‌?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ని ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. దీంతో ఇప్పుడు ఆయన బాలీవుడ్‌ సినిమాపై ఫోకస్‌ పెట్టారు. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ వార్‌ 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారట. అయితే చాలా రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. హృతిక్‌పై సీన్లు తీశారు. గత వారం నుంచి ఎన్టీఆర్‌ ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. గత వారం ఆయన వార్‌2 లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంబయిలో హల్‌చల్‌ చేశారు. అక్కడి సినిమా వాళ్లు ఎన్టీఆర్‌కి పార్టీ ఇచ్చారు. ప్రముఖ నటుడు అక్బర్‌ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. భవిష్యత్‌ సీఎం నువ్వే అని అన్నారు. ఆ వ్యాఖ్యలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి ముంబైకి వెళ్లారు తారక్. ఆదివారం ఆయన ముంబయికి బయలు దేరారు. వార్‌ 2 షూటింగ్‌ కోసం మరోసారి ఆయన ముంబయికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ లో సందడి చేశారు. ఇందులో ఆయన లుక్‌ వైరల్‌ అయ్యింది. వైట్‌ షర్ట్, జీన్స్ లో మెరిశారు ఎన్టీఆర్. మాస్‌ లుక్‌లో అదిరిపోయేలా ఉన్నారు. గెడ్డం ట్రిమ్‌ చేసి, షార్ట్ కటింగ్‌తో ఆర్మీ ఆఫీసర్‌ తరహాలో కనిపిస్తున్నారు. వార్‌ 2 గెటప్‌ లో అదరగొడుతున్నారు. అంతేకాదు ముంబయిలో ఆయన వాకింగ్‌ స్టయిల్‌, మాస్‌ అవతార్‌లో అదరగొట్టేలా ఉంది. ప్రస్తుతం తారక్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Read More: ఒకే ఇంట్లో ఉన్న 18 ఏళ్లకు ఆ పని చేయబోతున్న సూర్య జ్యోతిక?

ట్రెండింగ్ వార్తలు