ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు

April 22, 2024

ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు

ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్‌, ఓటీటీలో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డానికి సినిమాలు సిద్ధ‌మ‌య్యాయి. అయితే ఈ వారం విడుద‌ల‌య్యే సినిమాలు ఏంటో ఓ సారి చ‌దివేద్దాం…చాలా కాలం విరామం త‌ర్వాత నారా వార‌బ్బాయి నారా రోహిత్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. దాదాపు ప‌దేళ్ల క్రితం వ‌చ్చి విజ‌యం సాధించిన ప్రతినిధి (Prathinidhi) మూవీకి కొనసాగింపుగా రూపొందిన ప్ర‌తినిధి-2(Prathinidhi-2)తో త‌న అదృష్టాన్ని మ‌రోమారు పరీక్షించు కోనున్నారు. కాంట్ర‌వ‌ర్సీల‌కు పేరుగాంచిన ప్ర‌ముఖ‌ జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించడం మ‌రో విశేషం. ఈ సినిమాను ఏపీ ఎల‌క్ష‌న్ల కోస‌మే సిద్ధం చేశార‌ని.. ఈ సినిమా ద్వారా ఏపీ ఎల‌క్ష‌న్ల‌లో టీడీపీకి ఎంతో కొంత ఉప‌యోగం చేకూర్చాల‌నేది వారి ఉద్దేశ్యం అనే వార్త‌లు వినిపిస్తున్నాయి..మ‌రి ఈ శుక్ర‌వారం విడుద‌ల‌వుతున్న ఈ సినిమాని ప్రేక్ష‌కులు ఎంత‌వ‌ర‌కూ ఆద‌రిస్తారో చూడాలి..

తమిళ హీరో విశాల్‌కి తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. చాలా కాలం త‌ర్వాత మార్క్ ఆంటోని(Mark Antony) సినిమాతో స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు విశాల్‌..పందెంకోడి(PandemKodi) సినిమా విశాల్‌కి మాస్ హీరో గుర్తింపు ఇస్తే ఆ ఇమేజ్‌ని నిల‌బెట్టుకునేందుకు స‌హాయ‌ప‌డ్డ భ‌ర‌ణి(Bharani), పూజా(Pooja) సినిమాల ద‌ర్శ‌కుడు హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో మూడో సినిమాగా ర‌త్నం(Vishal Ratnam Movie) సినిమా తెర‌కెక్కింది. ప్రియా భ‌వాని శంక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ఊర‌మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 26న విడుద‌ల కానుంది. ఈ సినిమాతో విశాల్ స‌క్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తాడో లేదో వేచి చూడాలి.

ఆయుష్‌ శర్మ, సుశ్రీ మిశ్రా కీలక పాత్రల్లో కరణ్‌.బి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్‌ రుస్లాన్(Ruslaan). శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే ఈ వారం ఓటీటీలో(OTT) వచ్చే చిత్రాలు/సిరీస్‌ల విషయానికి వస్తే.. ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో డెడ్‌ బాయ్‌ డిటెక్టివ్స్‌( Dead Boy Detectives) అనే వెబ్‌సిరీస్‌ ఏప్రిల్‌ 25న విడుదల కానుంది. అలాగే టిల్లు స్క్వేర్‌(Tillu Square) ఏప్రిల్‌ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్‌ ప్రైమ్‌ లో దిల్‌ దోస్తీ డైలమా అనే హిందీ మూవీ ఏప్రిల్‌ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే బుక్‌ మై షో లో కుంగ్‌ఫూ పాండా 4 యానిమేషన్‌ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ లో గోపిచంద్‌ భీమా (Bhimaa) మూవీ ఏప్రిల్‌ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. క్రాక్‌ హిందీ ఏప్రిల్‌ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే (Telugu OTT Movies Week Release List)

Movie Name Release Date Online Streaming Partner డెడ్‌ బాయ్‌ డిటెక్టివ్స్‌: ఏప్రిల్‌ 25 (నెట్‌ఫ్లిక్స్‌)

దిల్‌ దోస్తీ డైలమా: ఏప్రిల్‌ 25 (అమెజాన్‌ ప్రైమ్‌)

భీమా: ఏప్రిల్‌ 25 (డిస్నీ)

టిల్లు స్క్వేర్‌: ఏప్రిల్‌ 26 (నెట్‌ఫ్లిక్స్‌)

కుంగ్‌ఫూ పాండా 4: ఏప్రిల్ 26 (బుక్‌ మై షో)

క్రాక్‌( హిందీ ): ఏప్రిల్‌ 26 (డిస్నీ)

ట్రెండింగ్ వార్తలు