April 17, 2024
వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు తరచూ సెలబ్రిటీల జాతకాలని చెబుతూ వార్తలలో నిలిచే ఈయన ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సెలెబ్రెటీలకు సంబంధించిన విషయాలను చెప్పడంతో వారి అభిమానులు భారీ స్థాయిలో ఈయనపై ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వేణు స్వామి గతంలో మెగా మనవరాలు జాతకాన్ని కూడా తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే.
ఉపాసన రాంచరణ్ దాదాపు 11 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులుగా మారారు. ఈ చిన్నారి పుట్టగానే ఎంతోమంది పండితులు అమ్మాయి జాతకాన్ని చెప్పారు. అయితే వేణు స్వామి కూడా చిన్నారి జాతకాన్ని చెప్పడంతో ఎంతోమంది మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు అంత చిన్న పిల్ల జాతకాన్ని ఎలా బయటకు చెప్పాకూడదు అనే కామన్ సెన్స్ కూడా లేదా అంటూ విమర్శలు చేశారు.
ఇలా తన పట్ల వచ్చినటువంటి విమర్శలు గురించి తాజాగా వేణు స్వామి స్పందించారు. క్లీన్ కారా జాతకాన్ని బయట పెట్టడానికి గల కారణాలను గురించి యాంకర్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా వేణు స్వామి తాను ఎందుకు మెగా మనవరాలు జాతకాన్ని బయటపెట్టాను అనే విషయాన్ని వెల్లడించారు.
కేవలం బాలారిష్టం ఉన్న పిల్లలకు మాత్రమే జాతకాలు చెప్పకూడదు . అది మాకు తెలుసు.. ఒకవేళ అలా చెప్తే వారికి ఉండే గడాలు గురించి కూడా చెప్పాలి . ఇలా గండాల గురించి చెప్పడం ప్రమాదకరంగా ఉంటుంది అందుకే పిల్లల జాతకాలను చాలా వరకు బయట పెట్టరు. కానీ పిల్లల జాతకంలో ఏ విధమైనటువంటి దోషాలు గండాలు లేకపోతే వారి జాతకాలను చెప్పవచ్చని వేణు స్వామి తెలిపారు.
మెగా మనవరాలు జాతకంలో ఒక్కటంటే ఒక్క దోషం కూడా లేదు . మహాజాతకురాలు తాతనే మించి పోయే జాతకం క్లింకారాది. అందుకే ఆమె జాతకం బయట పెట్టానని అయితే ఈ విషయాలన్నీ తెలుసుకొని ట్రోల్ చేసేవారు చేయాల్సి ఉంటుందని వారికే పని పాట లేదు కదా అని ఇలా ట్రోల్ చేయడం మంచిది కాదు అంటూ వేణు స్వామి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read More: #JaiHanuman: జీవితాంతం గుర్తుంచుకునే చిత్రాన్ని అందిస్తానని మాటిచ్చిన ప్రశాంత్ వర్మ