April 19, 2024
టాలెంటెడ్ టాలీవుడ్ స్టార్ హీరో సిద్దు జొన్నలగడ్డ డిజె టిల్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా టిల్లు స్క్వేర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. డిజె టిల్లు సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు.
ఈ సినిమాలో వీరిద్దరి నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇకపోతే ఈమె ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో తన లిమిట్స్ క్రాస్ చేసి మరి నటించారని చెప్పాలి. ఇలా అనుపమ బోల్డ్ సీన్స్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి. ఇక ఈ సినిమా థియేటర్లలో ప్రసారమవుతూ ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అయినటువంటి ఈ సినిమా త్వరలోనే డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమవుతుందని. ఈ సినిమా డిజిటల్ హక్కులను దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కైవసం చేసుకున్నారు. ఇక ఈ సినిమా థియేటర్ లో విజయవంతంగా రన్ అవ్వడంతో త్వరలోనే డిజిటల్ మీడియాలో కూడా ప్రసారం కాబోతోంది.
ఇదే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన చేశారు.చిత్రం ఈ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతుంది.ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. దీనితో ఈ చిత్రం తెలుగు సహా తమిళ్, కన్నడ, మళయాళం హిందీ భాషల్లో రానుంది. థియేటర్లో మెప్పించిన ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.
Read More: అంచనాలను పెంచేస్తున్న శర్వానంద్ మనమే టీజర్!