April 15, 2024
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ,అనుపమ కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. గత నెల మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుండడంతో చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతూ ఈ మూవీ ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఏప్రిల్ నెలాఖరులో ఓటీటీలోకి వస్తుందని టాక్ వచ్చింది. కానీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో స్ట్రీమింగ్ కాస్త ఆలస్యం కానుందని టాక్. మే 3వ తేదీ లేకపోతే మే నాలుగో వారంలోగా టిల్లు స్క్వేర్ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఈ విషయంపై కరెక్టు సమాచారం తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను వేసుకున్నారు హీరో సిద్దు జొన్నలగడ్డ.
Read More: యానిమల్ మూవీపై సెటైర్లు వేసిన సిద్ధార్థ్.. ఆ సినిమాను మాత్రం చూస్తారంటూ?