June 23, 2022
యాక్షన్ హీరో అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్, ఐశ్వర్య సర్జా హీరోహీరోయిన్లుగా ఓ నూతన చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హజరై హీరోహీరోయిన్ల తొలి సీన్‌కు క్లాప్ కొట్టాడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేసి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ను విష్ణు మంచు దర్శకుడికి అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ చిత్రానికి అర్జున్ కథా రచయిత, దర్శకత్వంతో పాటు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. అర్జున్‌కి మంచి స్నేహితుడైన జగపతిబాబు ఇందులో కీలకపాత్ర పోషించనున్నాడు.ఈ చిత్రానికి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించ నున్నారు.