Tollywood: టాలీవుడ్‌లో సంచలనం…కొత్త సినిమాలు రద్దు

September 10, 2022

Tollywood: టాలీవుడ్‌లో సంచలనం…కొత్త సినిమాలు రద్దు

కరోనా తర్వాత ఆడియన్స్‌ అభిరుచులు బాగా మారాయి. దీంతో కథల విషయంలో హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అవసరమైతే ఇంతకుముందు ఒకే చేసిన సినిమాలనే కాదు.. షూటింగ్‌ స్టార్ట్‌ చేసిన సినిమాలనుసైతం క్యాన్సిల్‌ చేసుకుంటున్నారు. దీంతో దర్శకులు, కథకలు ఆందోళన చెందుతున్నారు.

– చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించాల్సిన సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.

– అప్పుడెప్పుడో వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రకటన వచ్చింది. ఇందలో వెంకీ ఫిజిక్‌టీచర్‌గా నటిస్తున్నారని, ఫస్ట్‌లుక్‌ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా వైరల్‌ అయ్యియ. కానీ ఈ సినిమా తర్వాత ఏటో వెళ్లిపోయింది.

– హీరో పవన్‌కళ్యాణ్, దర్శకుడు హరీష్‌శంకర్‌ కాంబినేషన్‌లోని ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ సినిమా సం దిగ్ఢంలో పడింది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది.

– వరుణ్‌తేజ్, ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌లోచి చిత్రం ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మాతలు. గతంలో రామ్‌తో ప్రవీణ్‌ సత్తారు చేయాల్సిన ఓ సినిమా బడ్జెట్‌ కారాణాల వల్ల క్యాన్సిల్‌ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది.

– గతంలో రవితేజ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా అంటూ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. కానీ ఈసినిమాపై ఇప్పుడు క్లారిటీ లేదు.

– రామ్‌చరణ్‌ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉండాలి కానీ ఈ సినిమా ఇప్పుడు లేదనేటాక్‌ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది.
–హీరో మహేశ్‌బాబు, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలి. కానీ ఆగిపోయింది.ఈ కథతోనే అల్లు అర్జున్‌తో సుకుమార్‌ ‘పుష్ప’ సినిమా తీశారనే టాక్‌ వినిపించింది.
– హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌ కలిసి ‘అరవిందసమేత వీరరాఘవ’ అనే సినిమా చేశారు. ఆ తర్వాత రాజమౌళితో కలిసి ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ఓ హీరోగా చేశారు. ఈ సినిమా తర్వాత నిజానికి ఎన్టీఆర్‌చేయాల్సిన సినిమా త్రివిక్రమ్‌తో ఉండాల్సింది. కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల మధ్య కథ విషయంలో ఏకాభి ప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అయ్యింది. దీంతో ఇప్పుడు మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్‌.
– హీరో అల్లు అర్జున్, దర్శకుడు వేణు శ్రీ రామ్‌ కాంబినేషన్‌లో ‘దిల్‌’ రాజు చేయాల్సిన ‘ఐకాన్‌: కనపడుటలేదు’ అనే సినిమా ఇక లేనట్లే. అలాగే కొరటాల శివ కాంబినేషన్‌లో అల్లు అర్జున్‌ ఓ సినిమాచేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా వాయిదా పడింది. దీంతో సుకుమార్‌తో పుష్ప సినిమా చేశారుఅల్లు అర్జున్‌. ఈ సమయంలో కొరటాలతో మళ్లీ మరో సినిమా చేయాలని అల్లు అర్జున్‌ అనుకోవడంలేదు.
– ‘లైగర్‌’ సినిమా ఫెయిల్‌ కావడంతో ‘జనగణమన’ సినిమాను పూరీ జగన్నాథ్, హీరో విజయ్‌ దేవరకొండ క్యాన్సిల్‌ చేసుకున్నారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్, చార్మీ నిర్మిస్తున్నారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌లోవిజయ్‌ దేవరకొండ చేయాల్సిన ఓ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ ‘హీరో’ క్యాన్సిల్‌ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. తమిళ దర్శకుడు ఆనంద్‌ ఆన్నామళై ఈ సినిమాకు దర్శకుడు.
– ‘చల్‌ మోహనరంగ’ సినిమా తర్వాత దర్శకుడు కృష్ణచైతన్యతో ‘పవర్‌పేట’ అనే భారీ బడ్జెట్‌ సినిమాను ప్రకటించారు నితిన్‌. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమాలో సత్యదేవ్‌ ఓ కీ రోల్‌ చేయనున్నారనే టాక్‌కూడా వినిపించింది. కానీ ఈ సినిమా ఇక లేనట్లే నని అంటున్నారు. ప్రస్తుతం కృష్ణచైతన్య సినిమా శర్వానంద్‌ హీరోగా వస్తుంది. ఇందులో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.– ఇవే కాదు..నిఖిల్‌ చేయాల్సిన ‘శ్వాస’, మంచు మనోజ్‌ ‘అహాం బ్రహ్మాసీ’, నారా రోహిత్‌ ప్రకటించిన రెండు  చిత్రాలు కూడా క్యాన్సిల్‌ అయ్యాయి మరీ.

ట్రెండింగ్ వార్తలు