ఓజీతో సుజిత్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్!

February 16, 2024

ఓజీతో సుజిత్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడిపారు. కానీ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావడంతో సినిమాలను కాస్త తగ్గించారు. ఇకపోతే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు కమిట్ అయ్యారు అయితే కొన్ని సినిమాలు విడుదల కాగా మరికొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్నటువంటి తరుణంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే ఈయన సుజిత్ దర్శకత్వంలో ఓజి సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా సగం వరకు షూటింగ్ పూర్తిచేసుకుని ఆగిపోయింది అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఒక క్రేజీ పోస్టర్ విడుదల చేస్తూ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

ఈ సినిమా సెప్టెంబర్ 17 2024వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ మేకర్స్ వెల్లడించారు అయితే తాజాగా డైరెక్టర్ సుజిత్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేయడమే కాకుండా దానిని తన ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నారు. అయితే ఈయన షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మరి సుజిత్ ఎలాంటి పోస్ట్ చేశారనే విషయానికి వస్తే..

పవన్ కళ్యాణ్ చాలా కొంతమందితో మాత్రమే క్లోజ్ గా ఉంటారు అయితే ఈయన తాజాగా డైరెక్టర్ సుజిత్ భుజంపై చేయి వేసుకొని తనని దగ్గరకు తీసుకుని నడుస్తూ వెళ్తున్నటువంటి ఫోటోని డైరెక్టర్ సుజిత్ షేర్ చేశారు. ఇక ఈ ఫోటోని షేర్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఇలాంటి ఒక ఉహించని పిక్ చూడడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Read More: సైలెంట్ గా ఆ షూటింగ్ మొత్తం పూర్తి చేసిన బాలయ్య!

ట్రెండింగ్ వార్తలు