త్రివిక్రమ్‌, తమన్‌లకు టైమ్‌ లేదు..బ్రో…

July 23, 2023

త్రివిక్రమ్‌, తమన్‌లకు టైమ్‌ లేదు..బ్రో…

పవన్‌కళ్యాణ్‌ సినిమాలో ఉంటే చాలు. ఆ సినిమా రేంజ్‌, బిజినెస్‌లు నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటాయి. సినీ లవర్స్‌ కూడా పవన్‌ సినిమా అంటే చాలా ఇష్టపడుతుంటారు. సాయిధరమ్‌తేజ్‌, పవన్‌కళ్యాణ్‌లు లీడ్‌ రోల్స్‌ చేసిన తాజా చిత్రం ‘బ్రో: ది అవతార్‌’. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే అందించిన ఈ సినిమా కు నటుడు, దర్శక-నిర్మాత సముద్రఖని డైరెక్షన్‌ చేశారు.

టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ బ్రో ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగానే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ట్రైలర్‌లో పవన్‌కళ్యాణ్‌ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించడం అనేది పవన్‌ ఫ్యాన్స్‌కు ఆసక్తి కలిగించింది. పవన్‌ మ్యానరిజమ్స్‌ కూడా ఆకట్టుకునేలా, పవన్‌ ఫ్యాన్స్‌కు నచ్చేలా ఉన్నాయి.

కనిపించని త్రివిక్రమ్‌ మార్క్‌

పవన్‌కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్‌ దర్శకుడిగా వచ్చిన ‘జల్సా’, ‘అజ్ఞాతవాసి’ సినిమాల్లో త్రివిక్రమ్‌ కలం బలం కనిపించింది. అలాగే సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వహించి, త్రివిక్రమ్‌ కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు అందించిన ‘భీమ్లానాయక్‌(మలయాళం హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ తెలుగు రీమేక్‌)లోనూ కొన్ని డైలాగ్స్‌ బాగుంటాయి.

కానీ బ్రో సినిమా ట్రైలర్‌లో త్రివిక్రమ్‌ మార్క్‌ ఏ మాత్రం కనిపించలేదన్నది ఆయన అభిమానుల ఆరోపణ. అలాగే ‘బ్రో’ విషయంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ స్టైల్‌ మ్యూజిక్‌ కానీ, బ్యాగ్రౌండ్‌ ‍స్కోర్‌ కానీ ఆశించినట్లుగా లేవని ఆల్రెడీ పవన్‌ ఫ్యాన్స్‌ కంప్లైట్స్‌ చేశారు.

త్రివిక్రమ్‌ ప్రస్తుతం మహేశ్‌బాబుతో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి,‘అల..వైకుంఠపురములో..’ సినిమాల తర్వాత అల్లు అర్జున్‌తో చేస్తున్న సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా జరుగుతోంది. ఎలాగూ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లోని కొన్ని సినిమాల విషయంలో త్రివిక్రమ్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ ఉంటుంది. ఇలా మల్టీఫుల్‌ రీజన్స్‌ వల్ల ‘బ్రో’కు త్రివిక్రమ్‌ దగ్గర టైమ్‌ లేకపోయి ఉండచ్చు.

ఇటు తమన్‌ కూడ ప్రస్తుతం అరడజను సినిమాలపై వర్క్‌ చేస్తున్నాడు. వీలైనప్పుడు విదేశాల్లో మ్యూజిక్‌ కన్సెర్ట్స్‌ కూడా చేస్తున్నాడు. ఇలా బ్రో: ది అవతార్‌ కోసం తమన్‌ దగ్గర కూడా టైమ్‌ లేకపోవచ్చు.  ఇప్పటివరకూ వచ్చిన ‘బ్రో’ పాటలు, ట్రైలర్‌  ఆశించిన స్థాయిలో లేవు. మరి..సినిమా ఎలా ఉంటుందో చూడాలి

ఇంకా చ‌ద‌వండిదర్శకులకు షాక్‌ ఇస్తున్న రానా

ట్రెండింగ్ వార్తలు