April 13, 2024
సినీ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించినటువంటి వారిలో పూనమ్ కౌర్ ఒకరు. ఈమె హీరోయిన్ గా చాలా తక్కువ సినిమాలలో నటించారు. ఇక పలు సినిమాలలో హీరోకి చెల్లెలు లేదంటే హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈమె సినిమాలలో నటించి గుర్తింపు పొందడం కంటే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తలలో నిలచిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా వివాదాల ద్వారానే ఈమె పాపులర్ అయ్యారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా రాజకీయాలకు సంబంధించిన విషయాలతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకొని ఈమె తరచు వివాదాస్పద పోస్టులు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాసులను టార్గెట్ చేస్తూ ఈమె చేసే పోస్టులు సంచలనంగా మారుతూ ఉంటాయి.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల పవన్ కళ్యాణ్ పట్ల పెద్ద ఎత్తున వివాదాస్పద పోస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. వైసీపీ ప్రభుత్వ సానుభూతి పరుడైన ఓ నెటిజన్… ఆంధ్రప్రదేశ్ లో టెస్లా కార్ల కంపెనీ ఏర్పాటు చేయాలని ఎలన్ మస్క్ ని రిక్వెస్ట్ చేశాడు.
ఇక ఈయన లండన్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు ఈయన చేస్తున్నటువంటి పోస్ట్ కు పూనమ్ రిప్లై ఇస్తూ..ఎలన్ మస్క్ కి మూడు పెళ్లిళ్లు అయ్యాయి పర్వాలేదు కదా అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఈమె ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కు మూడు పెళ్లిళ్లు జరిగాయన్న ఉద్దేశంతోనే ఇలాంటి పోస్ట్ చేశారని పలువురు భావిస్తున్నారు. ఇకపోతే తరచూ పలువురు వైసిపి నాయకులతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పూనమ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
https://telugu.chitraseema.org/chiranjeevi-appluaded-teja-sajja-he-has-proved-as-an-actor%e0%b0%a4%e0%b1%87%e0%b0%9c%e0%b0%be-%e0%b0%b8%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%aa%e0%b1%88-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b6/