ఐపీఎల్ 2024 లో ప్రభాస్ కల్కి యాడ్ ప్రమోషన్.. వేరే లెవెల్ ప్రమోషన్!

May 1, 2024

ఐపీఎల్ 2024 లో ప్రభాస్ కల్కి యాడ్ ప్రమోషన్.. వేరే లెవెల్ ప్రమోషన్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ సినిమా మే తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా విడుదల కాస్త వాయిదా పడింది.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక భాషలలో అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమాలో అశ్వద్ధామ పాత్రలో నటిస్తున్నటువంటి అమితాబ్ పాత్ర గ్లింప్స్ ని ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా రిలీజ్ చేసారు. ఇక తాజాగా కల్కి లో ప్రభాస్ సూపర్ హీరో లుక్ తో ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నటువంటి ప్రోమో వీడియోని తమ ప్రమోషన్లలో భాగంగా విడుదల చేశారు.

ఐపీఎల్ ఒక యుద్ధం లాంటిదని, మే 3న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనున్న ఐపీఎల్ మెగా మ్యాచ్ కోసం సిద్ధంగా ఉండాలని ప్రభాస్ కోరడం ఆ యాడ్ లో చూడవచ్చు. ఇక ఈ యాడ్ ద్వారా ప్రభాస్ ఒకవైపు ఐపీఎల్ మ్యాచ్ ను అలాగే తన కల్కి సినిమాని కూడా ప్రమోట్ చేశారనే చెప్పాలి అయితే ప్రస్తుతం ఐపీఎల్ పై ఎంతోమంది ఆసక్తి కనబరుస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ప్రమోషన్స్ ద్వారా ప్రభాస్ తన సినిమాని కూడా ప్రమోట్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి.

ఇక ఇటీవల కాలంలో సినీ సెలెబ్రిటీలు అందరూ కూడా చాలా డిఫరెంట్ గా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేస్తున్నారు. ఇక కల్కి సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటించారు అంతేకాకుండా ఈ సినిమాలో కమల్ హాసన్ వంటి స్టార్ సెలబ్రిటీలు కూడా భాగమైన సంగతి తెలిసిందే.

Read More: డబ్బు కోసం నేను పెళ్లి చేసుకోలేదు.. రెండో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తప్పేంటి: వరలక్ష్మి

ట్రెండింగ్ వార్తలు