కల్కి కొత్త రిలీజ్ డేట్ ఇదేనా.. అదే రోజే రాబోతున్న ప్రభాస్!

April 6, 2024

కల్కి కొత్త రిలీజ్ డేట్ ఇదేనా.. అదే రోజే రాబోతున్న ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ గత ఏడాది డిసెంబర్ నెలలో సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే కల్కి సినిమా ద్వారా కూడా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా మే 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా రాబోతుందనే విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ సినిమా వాయిదా పడుతుందంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం మే 9వ తేదీ విడుదల కావాల్సినటువంటి ఈ సినిమా వాయిదా పడిందని తెలుస్తుంది ఎందుకంటే మే 13వ తేదీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్నటువంటి తరుణంలో సినిమా విడుదలైన పెద్దగా ప్రభావం చూపదన్న ఉద్దేశంతో ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. అయితే మే 9వ తేదీ విడుదల కావలసిన ఈ సినిమా మే 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా మే 30 వ తేదీ విడుదల కాబోతోంది అంటూ వార్తలు వస్తున్నా ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేదనే చెప్పాలి. ఇక ఈ సినిమా మే 30న విడుదల అయితే కనుక మేకర్స్ ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Read More: అశోక్ గల్లా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. జోడి బాగుందటున్న నెటిజన్స్!

ట్రెండింగ్ వార్తలు