ఎలక్షన్ ఎఫెక్ట్..వాయిదా బాటలో కల్కి నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్?

March 18, 2024

ఎలక్షన్ ఎఫెక్ట్..వాయిదా బాటలో కల్కి నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రభాస్ ఒకరు. ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సార్ హీరోగా మారిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇకపోతే ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా సుమారు 600 కోట్ల బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి స్టార్ సెలబ్రెటీలు నటిస్తున్నారు. ఇక ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భాషలలో మే 9వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ఇదివరకు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదల అవుతుందన్న సంతోషంలో ప్రభాస్ అభిమానులు ఉండగా ఒక్కసారిగా వారి ఆశలపై ఎలక్షన్ ఎఫెక్ట్ పడిందని చెప్పాలి. తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాలలో మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి.

ఇలా ఎన్నికలు మే 13వ తేదీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మే 9 వ తేదీ ఈ సినిమాని విడుదల చేసిన వర్కౌట్ కాదు అందుకే ఈ సినిమాని వాయిదా వేయబోతున్నారని తెలుస్తుంది. ఇలా ఈ సినిమా మరోసారి వాయిదా పడిబోతుందనే విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాని వాయిదా వేస్తున్నారా లేదంటే అనుకున్న సమయానికి విడుదల చేస్తారా అన్నది తెలియాలి అంటే మేకర్స్ స్పందించాల్సి ఉంది.

Read More: ఐటమ్ సాంగ్స్ పై సమంత కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు