Salaar: ప్ర‌భాస్‌ని డార్లింగ్ అని ఎందుకంటారో అప్పుడు అర్ధ‌మైంది – పృథ్వీరాజ్‌

December 16, 2023

Salaar: ప్ర‌భాస్‌ని డార్లింగ్ అని ఎందుకంటారో అప్పుడు అర్ధ‌మైంది – పృథ్వీరాజ్‌

రెబ‌ల్‌స్టార్ ప్రభాస్‌(Prabhas) హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌(Salaar)’. డిసెంబర్‌ 22న విడుదలకు సిద్ధమైంది. ఇందులో మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘సలార్‌(Salaar)’లో ప్రభాస్‌(Prabhas) దేవా పాత్రలో కనిపించనున్నాడు. నేను వరదరాజ మన్నార్‌గా కనిపిస్తాను. నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఇంత గొప్ప స్క్రిప్ట్‌ చూడలేదు. ఈ చిత్రంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా హిట్‌ అవుతుందని మా అందరికీ పూర్తి నమ్మకముంది. ఇక ప్రభాస్‌ను ఎవరైనా ఇష్టపడతారు. నాకు చాలా తక్కువ మంది స్నేహితులున్నారు. కానీ, నేను తరచూ మాట్లాడే వ్యక్తుల్లో ప్రభాస్‌ ఒకరు. సెట్‌లో ఉన్న అందరినీ జాగ్రత్తగా చూసుకుంటారు. అందరి కోసం భోజనం తెప్పిస్తారు. తన చుట్టూ ఉండేవాళ్లు ఆనందంగా ఉండేలా చూస్తారు. ఆయన అభిమానులు డార్లింగ్‌ అని ఎందుకంటారో ఈ షూటింగ్‌ సమయంలోనే నాకు అర్థమైంది’’ అని చెప్పుకొచ్చారు.

ఇక ‘సలార్‌’ గురించి మాట్లాడుతూ..‘‘సలార్’తో నా కల నెరవేరింది. ఇప్పటి వరకు టీజర్‌, ట్రైలర్‌లో చూసింది చాలా తక్కువ. కేవలం యాక్షన్‌ మాత్రమే కాదు.. ఎన్నో ఎమోష‌న్స్‌తో ముడిపడి ఉన్న కథ ఇది. థియేటర్‌కు వచ్చిన వారంతా మంచి సినిమా చూశామన్న భావనతో బయటకు వస్తారు. ‘సలార్’ రెండో భాగం లీడ్‌ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అని చెప్పారు.

హెలికాఫ్టర్లతో సెల్యూట్‌..

ఇక ఒకవైపు చిత్రబృందం ప్రచారం జోరు పెంచగా..మరోవైపు ఫ్యాన్స్‌ వినూత్న రీతిలో ఈ సినిమాపై అభిమానాన్ని చాటుకున్నారు. కెనడాలోని ప్రభాస్‌ అభిమానులు ఆరు హెలికాఫ్టర్లతో ప్రభాస్‌కు ఎయిర్‌ సెల్యూట్‌ చేశారు. సలార్‌ లుక్‌కు సంబంధించిన భారీ పోస్టర్‌ను ఏర్పాటు చేసి దాని పైన ఒకేసారి ఆరు హెలికాఫ్టర్లు గాల్లో ఎగురుతూ సెల్యూట్ చేస్తున్నట్లు వీడియో చేశారు. దాన్నిహోంబలే ఫిల్మ్స్‌ షేర్‌ చేసింది.

Read More: Bigg Boss 7 Telugu: ఐకానిక్ స‌న్నివేశాల‌ను రీక్రియేట్ చేపించిన బిగ్‌బాస్‌..అద‌ర‌గొట్టిన ప్రియాంక‌

ట్రెండింగ్ వార్తలు