May 4, 2024
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాలంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో మనకు తెలిసిందే. ఇలా ఈయన హీరోగా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా వెండితెరపై అన్ని భాషలలో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు థియేటర్లలో మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఆదరణ లభించింది. ఈ సినిమాని ఎక్కువగా ఓటీటీలలో ప్రేక్షకులు చూశారని చెప్పాలి.
ఇలా వెండితెర పైన అలాగే డిజిటల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈ సినిమా ఇటీవల స్టార్ మా లో ప్రసారమైన సంగతి మనకు తెలిసింది. ఇలా బుల్లితెరపై పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమా మొదటిసారి ప్రసారం కాబోతుంది అంటేనే ఆ సినిమాపై భారీ అంచనాలే ఉంటాయి.
ఇక ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం కాగా ఈ సినిమాకు వచ్చినటువంటి రేటింగ్ కి సంబంధించిన విషయాలను వెల్లడించారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాకు కేవలం 6.5 రేటింగ్ రావడంతో ఒక్కసారిగా మేకర్స్ షాక్ అయ్యారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ రావడం నిజంగా ఎవరు ఊహించని విషయం అని చెప్పాలి. అయితే ఈ సినిమాని థియేటర్లలోను అలాగే ఓటీటీలలోనూ చూడటం వల్లే ఇలా బుల్లితెరపై తక్కువ రేటింగ్ వచ్చిందని చెప్పాలి.
Read More: సాయి పల్లవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సామ్.. నెట్టింట వీడియో వైరల్?