నా భర్తతో గొడవలు ఉండటం వాస్తవమే.. విడాకుల వార్తలు నిజమేనా?

February 16, 2024

నా భర్తతో గొడవలు ఉండటం వాస్తవమే.. విడాకుల వార్తలు నిజమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో ప్రియమణి ఒకరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తయింది. 2003వ సంవత్సరంలో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ప్రియమణి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సినిమాలలో నటించారు. ఇక హీరోయిన్గా ఈమె ఫేడౌట్ అయ్యారు. ఇలా హీరోయిన్ గా సినిమా అవకాశాలు అందుకోకపోయినా ఇతర పాత్రలలో నటించే అవకాశాలను అందుకుంటు వచ్చారు.

ప్రియమణి స్టార్ హీరోలకు తల్లి పాత్రలలోనూ లేదా గృహిణి పాత్రలలోనూ నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈమె సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రియమైన నటించిన భామకలాపం 2 వెబ్ సిరీస్ ఆహాలో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా ఈ సిరీస్ ప్రసారం కాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

భామాకలాపం 2 సిరీస్లో ప్రియమణి గృహిణిగా హోమ్లీ రోల్ చేశారు. ఈ పాత్రలో ఓ పెద్ద గ్యాంగ్ ని అల్లాడించే వైలెంట్ షేడ్ కూడా ఉంది. నిజ జీవితంలో ప్రియమణి భర్తను భయపెడుతుందా? భయపడుతుందా? అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ప్రియమణి సమాధానం చెబుతూ నిజజీవితంలో నేను నా భర్తకు భయపడతాను. అంతేకాకుండా భయపెడతాను అంటూ సమాధానం చెప్పారు. భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు రావడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. నేను కూడా నా భర్తతో చాలాసార్లు గొడవపడ్డానని ఈమె తెలిపారు.

కొన్ని సందర్భాలలో భర్త మాట భార్య వినాలి. భార్య మాట భర్త వినాలి. ఏ విషయంలోనైనా కూడా ఇద్దరి ఆలోచనలు అభిప్రాయాలను తెలియజేయాలి అంటూ ఈమె తెలిపారు. ఇలా తన భర్తతో ఉన్న గొడవల గురించి ఈమె క్లారిటీ ఇచ్చారు. అయితే గతంలో ఈమె తన భర్తతో నిజంగానే గొడవలు పడిందని దీంతో ఆయన విదేశాలలో ఉండగా ఈమె ఇక్కడే ఉందని వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ప్రియమణి చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారని అయితే తన భర్త బిజినెస్ పనుల నిమిత్తం విదేశాలలో ఎక్కువగా ఉంటున్నారని స్పష్టమవుతుంది.

Read More: అమ్మాయిని అల్లర చేయబోయి తన్నులు తిన్న హైపర్ ఆది!

ట్రెండింగ్ వార్తలు