బాడీ షేమింగ్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన హీరోయిన్ ప్రియమణి?

April 17, 2024

బాడీ షేమింగ్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన హీరోయిన్ ప్రియమణి?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. మొదట ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించింది.

అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా అనేక డాన్స్ షోలకు జడ్జ్ గా వ్యవహరించింది. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు డాన్స్ షోలకు జెడ్జ్ గా వ్యవహారిస్తోంది ప్రియమణి. కాగా మాములుగా ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ గురించి తరచుగా ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. చర్మం రంగు, శరీరం ఆధారంగా నటీమణులను విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది హీరోయిన్స్ ఈ టైప్ బాడీ షేమింగ్ విమర్శలు ఎదుర్కొన్నారు.

సోషల్ మీడియా వాడకం ఎక్కువైన దగ్గరనుంచి హీరోయిన్స్ గురించి సెలబ్రెటీల గురించి ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడ్డారు. తాజాగా ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి షాకింగ్ కామెంట్స్ చేసింది. జీరో సైజ్ సమస్యపై ఆమె మాట్లాడింది. బాగా కనిపించాలంటే ఏం చేయాలో అది చేయాలి. అది మీ వ్యక్తిగత ఎంపిక. నేను ఉన్న పరిశ్రమలో పోలికలు జరుగుతూనే ఉంటాయి. సౌత్ లో జీరో సైజ్‌ కావాలని ఎవరూ చెప్పలేదు. మన నటీమణులు ఈరోజు చాలా ఫిట్‌గా ఉన్నారు. వారు ఏమి తింటారు? వారు ఎలా కనిపిస్తారు? అనే దాని గురించి చాలా క్లారిటీతో ఉన్నారు. అయితే ఒకప్పుడు అంత క్లారిటీ ఉండే నటీమణులు చాలా తక్కువ. ఏది కావాలంటే అది తింటారు. ఇటీవల సైజ్ జీరో అంశం ఎక్కువగా చర్చనీయాంశం అవుతోంది అని తెలిపారు ప్రియమణి.

Read More: అల్లు అర్జున్‌ సినిమాల్లో సీన్లు రీక్రియేట్‌ చేస్తూ ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో నుంచి ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ సాంగ్

ట్రెండింగ్ వార్తలు