March 29, 2024
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలను మాత్రమే పరిగణలోకి తీసుకునేవారు. అంతేకాకుండా సౌత్ సినిమాలు అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్త చిన్న చూపు కూడా ఉండేది కానీ బాహుబలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత సౌత్ సినిమాల పట్ల నార్త్ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు పూర్తిగా వారి అభిప్రాయాలను మార్చుకున్నారు.
బాహుబలి సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో సౌత్ నుంచి ఎన్నో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ విధంగా సౌత్ సినిమాలను చూసి నార్త్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సౌత్ సెలబ్రిటీలకు సినిమాలకు భారీ స్థాయిలో గౌరవం పెరిగిపోయింది. ఇక సౌత్ సినిమాలకు ఏకంగా ఆస్కార్ అవార్డులు కూడా రావడంతో ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు సౌత్ సినీ సెలబ్రిటీలపై ప్రశంసలు కురిపించడమే కాకుండా సౌత్ సినిమాలలో కూడా భాగం అవుతున్నారు.
ఇలా ప్రస్తుతం నార్త్ సౌత్ అనే తేడా లేకుండా సినిమాలలో నటిస్తున్నప్పటికీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఈ భేదాలను చూస్తున్నారని తాజాగా నటి ప్రియమణి వెల్లడించారు. మీరు సౌత్ వాళ్ళు కాబట్టి మీకు సరైన పాత్రలనే ఇస్తున్నామని చెబుతున్నారు అయితే ఈ విషయంలో త్వరలోనే మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ఈమె తెలిపారు. మేము దక్షణాది సెలబ్రిటీలు అయినప్పటికీ వారితో పాటుగా నటించగలము హిందీ చక్కగా మాట్లాడగలము ఎమోషన్స్ అద్భుతంగా పండించగలమని తెలిపారు.
నార్త్ సెలబ్రిటీలతో పోలిస్తే నటన పరంగా మేము ఎక్కడా తక్కువ కాదు వారి కంటే కాస్త కలర్ తక్కువ అయినప్పటికీ నటనలో ఏ మాత్రం తీసిపోమని కలర్ అనేది పెద్ద విషయం కాదు. అయినా నార్త్, సౌత్ అని తేడా చూడకూడదు.. ఎందుకంటే అందరూ భారతీయులమే అంటూ ప్రియమణి ఈ సందర్భంగా నార్త్ సౌత్ అంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More: జరగండి పాట కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా.. ఏం లాభమాయ్యా శంకర్?