ఉత్తమ నటీనటులుగా షారుక్ ఖాన్, నయనతార.. దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న సెలబ్రిటీస్!

February 21, 2024

ఉత్తమ నటీనటులుగా షారుక్ ఖాన్, నయనతార.. దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న సెలబ్రిటీస్!

సినీ ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులు నటీనటులను ప్రోత్సహిస్తూ వారికి అందజేస్తూ ఉంటారు. ఇలా సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అవార్డులలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఒకటి తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే 2024 అవార్డులను ప్రకటించారు. తాజాగా ఈ అవార్డులలో భాగంగా ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి అవార్డును అందుకున్నారు.

ఈయన గత ఏడాది చివరిన యానిమల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు గాను ఈయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఇక ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఉత్తమ నటుడిగా నటుడు షారుక్ ఖాన్ అవార్డు అందుకున్నారు.

ఇక ఉత్తమ నటిగా దక్షిణాది స్టార్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఈ వేడుకలు మంగళవారం రాత్రి ముంబైలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక నయనతార షారుక్ ఖాన్ ఇద్దరు కలిసి ఇటీవల డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా షారుఖ్ ఖాన్ మరో వెయ్యి కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే వరించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More: మహేష్.. రాజమౌళి సినిమాపై క్లారిటీ అప్పుడే.. వెయిట్ చేయాల్సిందే?

ట్రెండింగ్ వార్తలు