గ‌తంలో నేనొక్క‌డినే విష‌యంలో జ‌రిగిందే ఇప్పుడు పుష్ప విష‌యంలోనూ జ‌ర‌గ‌నుందా..?

December 18, 2021

గ‌తంలో నేనొక్క‌డినే విష‌యంలో జ‌రిగిందే ఇప్పుడు పుష్ప విష‌యంలోనూ జ‌ర‌గ‌నుందా..?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా డిసెంబ‌రు 17న‌ ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న రాబట్టుకుంది. సినిమా ఎలా ఉన్నా పుష్ప క్యారెక్ట‌ర్ మాత్రం ప్రాణం పెట్టి చేశాడు అల్లు అర్జున్‌. సినిమా ప్రారంభమైన మరుక్షణం నుండి ఆడియెన్స్ కు పుష్ప రాజ్ తప్ప అల్లు అర్జున్ ఎక్క‌డా కనిపించడు. ఎవరి కిందా పనిచేయడానికి ఇష్టపడని వ్యక్తిగా, తన మాటే నెగ్గాలనే తత్త్వమున్న మొరటోడిగా బన్నీ అద‌ర‌గొట్టాడు. ‘తగ్గేదే లే’ అనే మేనరిజాన్ని ఒక్కో చోటా ఒక్కోలా పలికిన బన్నీ నటన చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. క‌నీసం డ్యాన్స్‌లో కూడా పుష్ప క్యారెక్ట‌ర్ నుండి బ‌య‌ట‌కురాలేదు బ‌న్నీ దాంతో మా హీరో పుష్ప‌రాజ్ క్యారెక్ట‌ర్‌ని ప్రాణం పెట్టి చేశాడు అని ఫ్యాన్స్ ఆనందానికి అవ‌దుల్లేకుండా పోయాయి.

Read More: సీక్వెల్సా? కొత్త కథా? కన్‌ఫ్యూజన్‌లో సుకుమార్‌

ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా ఒక్క విషయంలో మాత్రం బ‌న్నీ అభిమానుల‌తో పాటు ప్రేక్షకులు ఇబ్బందిప‌డుతున్నారు. అదే సినిమా నిడివి. ఆల్రెడీ రెండు భాగాలుగా చేయాలని ఫిక్స్ అయినపుడు.. మొదటి భాగం క్రిస్పీగా ఉండుంటే బాగుండు అని చాలా మంది అభిప్రాయప‌డుతున్నారు. మూడు గంటలు నిడివి ఈ సినిమాకు పెద్ద మైన‌స్‌గా మారింది. అవసరం లేని చాలా సన్నివేశాలు సినిమాను బాగా డిస్టర్బ్ చేసాయి. ముఖ్యంగా బన్నీ, రష్మిక ట్రాక్ అంతా ఆకట్టుకోకపోగా.. విసుగు పుట్టించాయనేది విశ్లేషకుల అభిప్రాయం. లవ్ ట్రాక్ బాగా ఇరికించినట్లు అనిపిస్తుంది. ప్ర‌తిక్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేయాల‌ని ఉద్దేశ్యంతో సెకండాఫ్‌లోనూ కొన్ని సన్నివేశాలు బలవంతంగా తీసుకొచ్చి అతికించినట్లు అనిపిస్తుంది. అన‌సూయ ఎపిసోడ్‌కు ఆడియ‌న్స్ పెద‌వి విరుస్తున్నారు. ఆమె క్యారెక్ట‌ర్ లేక‌పోయినా సినిమాకు వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీంతో ర‌ష్మిక‌, అన‌సూయ‌, శ‌త్రు, ధ‌నుంజ‌య్ పాత్ర‌ల‌కు సంభందించి కొన్ని సన్నివేశాలు తీసేస్తే చాలా బెటర్ అంటూ ఇప్పటికీ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. వీటి గురించి చిత్ర యూనిట్ ఓసారి ఆలోచిస్తే బెటర్ అంటున్నారు అభిమానులు.

Read More: నానిని కలవరపెడుతున్న విషయం ఏంటో తెలుసా?

గతంలో మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమా విషయంలోనూ ఇదే చేశాడు సుకుమార్. అప్పుడు కూడా దాదాపు 2 గంటల 50 నిమిషాలతో వచ్చిన మహేష్ బాబు సినిమాను.. విడుదల తర్వాత 20 నిమిషాలకు పైగా ట్రిమ్ చేసారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మ‌రీసారైనా సుకుమార్‌ ముందే జాగ్ర‌త్త ప‌డ‌తారో లేదో చూడాలి. ఇక అంతా పుష్ప: ది రూల్ మొత్తం పుష్ప‌ రాజ్, భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్‌ల‌ మధ్య ఇగో క్లాష్ నేపథ్యంలోనే కథ సాగనుంద‌ట‌.

ట్రెండింగ్ వార్తలు