గంగమ్మ జాతరలో శివాలేత్తిన పుష్పరాజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్!

April 8, 2024

గంగమ్మ జాతరలో శివాలేత్తిన పుష్పరాజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు .పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా కూడా భారీ స్థాయిలో హిట్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో షూటింగ్ పనులను కూడా చాలా త్వరగా జరుగుతున్నాయి. ఇకపోతే నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు ఇలా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ వీడియో విడుదల చేశారు.

మైత్రి మూవీ మేకర్స్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేసినటువంటి ఈ టీజర్ వీడియోస్ సోషల్ మీడియాలో సంచలనగా మారింది. ఈ టీజర్ వీడియోలో భాగంగా అల్లు అర్జున్ గంగమ్మ జాతరకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ రూపొందించారు అచ్చం అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ ని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఇలా అమ్మవారి పాత్రలో అల్లు అర్జున్ కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది.

ఇలా జాతరలో అమ్మవారి గేటప్ లో శత్రువులపై శివాలెత్తినటువంటి పుష్పరాజ్ కి సంబంధించినటువంటి ఈ సీన్స్ చూస్తుంటే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బన్నీ ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీజర్ లాంచ్ అనంతరం సినిమాపై మరింత ఆత్రుత పెరిగిందని చెప్పాలి.

Read More: టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని ఫేవరెట్ హీరోలు వీళ్లేనా.. ఎందుకంత స్పెషల్?

ట్రెండింగ్ వార్తలు