Mirai Telugu Glimpse: ‘మిరాయ్’ గా వస్తున్న హనుమాన్ హీరో.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టైటిల్ గ్లింప్స్.

April 18, 2024

Mirai Telugu Glimpse: ‘మిరాయ్’ గా వస్తున్న హనుమాన్ హీరో.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టైటిల్ గ్లింప్స్.

‘హను-మాన్‌’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు టాలీవుడ్ యువకథానాయకుడు తేజ సజ్జా. ఇక ఈ సినిమా అనంత‌రం అత‌డికి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక తేజ తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎట్టకేలకు అతని తాజా సినిమా ప్రకటన వెలువడింది.

‘హను-మాన్‌’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు టాలీవుడ్ యువకథానాయకుడు తేజ సజ్జా. ఇక ఈ సినిమా అనంత‌రం అత‌డికి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక తేజ తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎట్టకేలకు అతని తాజా సినిమా ప్రకటన వెలువడింది. ఈగ‌ల్ ద‌ర్శ‌కుడు కార్తీక్‌ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వంలో పాన్‌ ఇండియా సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో తేజ సూపర్‌యోధగా కనిపించ‌నున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌తో పాటు గ్లింప్ల్స్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు మిరాయ్ (Mirai) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక మిరాయ్ అంటే ఫ్యూచ‌ర్ అని అర్థం.

కళింగ యుద్ధం తర్వాత యోగిగా మరిపోయిన అశోకుడు గురించి ఈ సినిమా తీయనున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. అశోకుడిని యోగిగా మార్చిన ఓ గ్రంథం కోసం జరిగే పోరాటమే ఈ సినిమా స్టోరీ. దాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు. అయితే దాన్ని కాపాడటం కోసం ఒక యోధుడు ఉంటాడు. ఆ పాత్రనే హీరో తేజ సజ్జ చేయనున్నారు. ప్ర‌స్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట దూసుకుపోతుంది. ఇందులో తేజ స‌జ్జా స్టెలిష్‌ మేక్‌ ఓవర్‌తో సూపర్‌యోధగా క‌నిపిస్తున్నాడు.

ఇక భారీ బ‌డ్జెట్‌తో వ‌స్తున్న ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి రచన: మణిబాబు కరణం, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Read More: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి.. 50 మీటర్లు లాక్కెళ్ళి అలా?

ట్రెండింగ్ వార్తలు