నాగచైతన్య హీరోయిన్ పై సమంత కామెంట్స్.. చూస్తూ అలా ఉండిపోయానంటూ?

February 23, 2024

నాగచైతన్య హీరోయిన్ పై సమంత కామెంట్స్.. చూస్తూ అలా ఉండిపోయానంటూ?

సమంత ప్రస్తుతం ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈమె మయోసైటిసిస్ వ్యాధికి గురి కావడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె వివిధ దేశాలకు వెళ్తూ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు అయితే ప్రస్తుతం ఈమె ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలుస్తుంది.

ఇలా మయోసైటిస్ వ్యాధికి గురైనటువంటి సమంత తన వ్యాధి నయం కావడంతో తన హెల్త్ గురించి తెలియజేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సమంతకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈమె తన మాజీ భర్త నాగచైతన్య హీరోయిన్ గురించి ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

నటి సాయి పల్లవి గురించి సమంత మాట్లాడుతూ తాను ఒక అద్భుతమైన డాన్సర్ అని తెలిపారు. తాను ఒక డాన్స్ షోలో పాటిస్పేట్ చేసిన సమయంలో ఆ కార్యక్రమానికి తాను జడ్జిగా వెళ్లానని సమంత తెలిపారు. అక్కడ ఆమె డాన్స్ చేసే విధానం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని, కల్లా ఆర్పకుండా తన వంకే చూస్తూ ఉన్నాను అంటూ సమంత సాయి పల్లవి డాన్స్ పై ప్రశంసలు కురిపిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే మరో సినిమా ద్వారా వీరిద్దరు ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా ఈ ఏడాది దసరా పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Read More: మహేష్ బన్నీలకు పోటీ ఇస్తున్న రవితేజ.. కొత్త బిజినెస్ ప్రారంభం?

ట్రెండింగ్ వార్తలు