వేసవి విడుదలకు సిద్ధమైన ఫ్యామిలీ స్టార్.. రిలీజ్ డేట్ ఫిక్స్?

February 3, 2024

వేసవి విడుదలకు సిద్ధమైన ఫ్యామిలీ స్టార్.. రిలీజ్ డేట్ ఫిక్స్?

రౌడీ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయ్ పాన్ ఇండియా స్థాయిలో కూడా అదే ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అంచనాలను తారుమారు చేస్తూ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిన తర్వాత విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ప్రయత్నాలు చేయటం లేదు. తనకు అనుకూలంగా ఉండే సినిమాలను ఎంపిక చేసుకొని కెరీర్లో ముందుకు సాగుతున్నారు. ఈ సినిమా తర్వాత సమంతతో కలిసి నటించిన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తదుపరి ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

గీత గోవిందం ఫేమ్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీన ఇటీవల మేకర్స్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీన ప్రకటిస్తూ సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అని స్పష్టంగా తెలుస్తోంది భుజంపై సంచి వేసుకుని లుంగీ కట్టుకొని నోట్లో ఆధార్ కార్డు పెట్టుకుని ఉన్నటువంటి ఒక పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ ఫ్యామిలీ స్టార్ వేసవి సెలవులను పురస్కరించుకొని ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

Read More: రెండు కార్లు కొన్న ఆట సందీప్, జ్యోతి.. నెట్టింట ఫొటోస్ వైరల్?

ట్రెండింగ్ వార్తలు