టాలీవుడ్ లో కొనసాగుతున్న సీక్వెల్స్ హవా.. పూలదారి పరిచిన బాహుబలి!

February 20, 2024

టాలీవుడ్ లో కొనసాగుతున్న సీక్వెల్స్ హవా.. పూలదారి పరిచిన బాహుబలి!

కొంతకాలం క్రితం వరకు టాలీవుడ్ లో సీక్వెల్స్ సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యేవి. ఆర్య, గబ్బర్ సింగ్, గాయం, కిక్, చంద్రముఖి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకి సీక్వెల్స్ విడుదలయ్యాయి కానీ బాక్సాఫీస్ ముందు డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సీక్వెల్ నుంచి పరిస్థితులు మారాయని చెప్పుకోవాలి. బాహుబలి రెండవ భాగం బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద హిట్ గా నిలిచింది.

సీక్వెల్స్ సినిమాలకి పూల దారి పరిచింది. కే జి ఎఫ్ సీక్వెల్ అయిన కే జి ఎఫ్ 2 కూడా పెద్ద హిట్ గా నిలిచింది. అలాగే హిట్ కి సీక్వెల్ అయిన హిట్ 2, కార్తికేయ కి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 సినిమాలు మంచి హిట్ ని అందుకున్నాయి. ఇక త్వరలో సూపర్ హిట్ అయిన మరిన్ని సినిమాల సీక్వెల్స్ మన ముందుకి రాబోతున్నాయి.అఖండ విజయాన్ని అందుకున్న సినిమా అఖండ. ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుందని బోయపాటి ఎప్పుడో అనౌన్స్ చేశారు.

అలాగే పుష్ప తో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ ఇప్పుడు పుష్ప టు మేకింగ్ లో బిజీగా ఉన్నారు. అలాగే సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ పేరుతో త్వరలోనే మన ముందుకి రాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర రెండు భాగాలు గా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ప్రభాస్ సలార్ తో సాలిడ్ హిట్ ని అందుకొని ఇప్పుడు సలార్ టూ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న రామ్ డబల్ ఇస్మార్ట్ గా మన ముందుకి రాబోతున్నాడు. మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇక తొమ్మిదేళ్ల క్రితం గీతాంజలిగా వచ్చి మనందరినీ బయపెట్టిన అంజలి ఇప్పుడు మళ్లీ “గీతాంజలి మళ్లీ వచ్చింది” అంటూ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అలాగే ప్రభాస్ సీక్వెల్ గా నటిస్తున్న మరొక సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమా కూడా రెండు పార్ట్స్ గా రాబోతుంది.

Read More: ఆర్సీ16 మూవీలో ఆఫర్ రిజెక్ట్ చేసిన సీనియర్ యాక్టర్.. అదే కారణం అంటూ స్టేట్మెంట్!

ట్రెండింగ్ వార్తలు