ShahRukhKhan-AbRamKhan: షారుఖ్ పుత్రోత్సాహం.. అబ్‏రామ్ వీడియో వైర‌ల్‌

December 16, 2023

ShahRukhKhan-AbRamKhan: షారుఖ్ పుత్రోత్సాహం.. అబ్‏రామ్ వీడియో వైర‌ల్‌

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‏కు(Shah Rukh Khan) సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతుంది. షారుఖ్ చిన్న కుమారుడు అబ్‏రామ్(AbRam Khan) ముంబైలోని ధీరూభాయ్ అంబానీ పాఠశాలలో చదువుకుంటున్నాడు.

ఇటీవల ఈ స్కూల్లో వార్షిక దినోత్సవం ఎంతో గ్రాండ్‏గా జరిగింది. ఈ వేడుకలో అబ్రహమ్ ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇన్నాళ్లు తండ్రితో ఎంత క్యూట్ గా కనిపించిన అబ్‏రామ్(AbRam Khan).. స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకలో మాత్రం తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా నాటకం ముగింపు సమయంలో తన తండ్రి షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) సిగ్నేచర్ ఫోజు.. (చేతులు చాచి నిలబడడం) ప్రదర్శించి తల్లిదండ్రులతో సహా అందరినీ ఆశ్యర్యానికి గురిచేశాడు. పాతకాలపు దుస్తులను ధరించి కనిపించాడు. చివరగా.. ‘గివ్ మీ హగ్.. ఐ లవ్ హగ్స్’ అంటూ షారుఖ్ సిగ్నేచర్ ఫోజుతో చేతులు చాచి నిల్చున్నాడు. అదే సమయంలో బ్యాగ్రౌండ్‏లో దిల్ వాలే దుల్హనియా జాయేంగే ట్యూన్ ప్లే అవుతుంది.

దీంతో అబ్‏రామ్ తోటి క్లాస్ మేట్స్ అతడిని హాగ్ చేసుకుంటూ కనిపించాడు. అయితే అబ్‏రామ్ నటన, తన సిగ్నేచర్ ఫోజు ఇవ్వడం చూసి అక్కడే ఉన్న షారుఖ్ పొంగిపోయాడు. బాద్ షా కళ్లలో పుత్రోత్సాహము కనిపిస్తుంది. ఆ వీడియోలో షారుఖ్, గౌరీ ఖాన్, సుహానా అబ్‏రామ్ ను ఉత్సాహపరుస్తూ కనిపించారు. ప్రస్తుతం అబ్‏రామ్ పర్ఫార్మెన్స్ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ఇది చూసిన నెటిజన్స్.. అతను చాలా ముద్దుగా ఉన్నాడని.. షారుఖ్ జిరాక్స్ కాపీ.. జూనియర్ బాద్ షా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Read More: Hi Nanna: నా ప్రతి సినిమాకి ఇలాంటి వేడుక ఉండేలా చూస్తాను-నాని

ట్రెండింగ్ వార్తలు