వరస్ట్ మార్కెటింగ్.. షారుఖ్ పై ఫాన్స్ ఫైర్.. బాద్షా క్లాసిక్ రిప్లై..

December 28, 2023

వరస్ట్ మార్కెటింగ్.. షారుఖ్ పై ఫాన్స్ ఫైర్.. బాద్షా క్లాసిక్ రిప్లై..

బాలీవుడ్ బాద్షా నటుడు షారుక్ ఖాన్(Shah Rukh Khan) తాజాగా డంకీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలు ఉన్నప్పటికీ విడుదలైన తర్వాత మాత్రం పెద్దగా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది అదేవిధంగా మరుసటి రోజే ప్రభాస్ సలార్ (Prabhas Salaar) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా మార్కెట్ పూర్తిగా తగ్గిపోయిందని తెలుస్తోంది.

సలార్ ప్రభావం కారణంగా ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్దగా కలెక్షన్స్ రాబట్ట లేకపోవడంతో పలువురు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) అభిమానులు ఈ సినిమా కలెక్షన్లపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఒక అభిమాని షారుక్ ఖాన్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా కలెక్షన్లపై నిరాశ వ్యక్తం చేశారు. సార్ జవాన్ డంకీ సినిమాల మార్కెట్ పూర్తిగా పడిపోయింది.

మార్కెట్ పూర్తిగా పడిపోవడంతో మీ రెడ్ చిల్లి ఎంటర్టైన్మెంట్ ఎంప్లాయిస్ ను వెంటనే మార్చేయండి, టాలెంట్ ఉన్న వారిని అపాయింట్ చేయండి అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్లపై షారుక్ ఖాన్ కూడా స్పందిస్తూ నేను కూడా పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేస్తున్నానని, మరి నన్ను నేను ఎలా తొలగించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈయన ఇచ్చినటువంటి రిప్లై ప్రస్తుతం వైరల్ గా మారింది.

https://x.com/iamsrk/status/1739960900025712860?s=20

Read Moreకలెక్షన్లపై వెనక్కి తగ్గిన హోంభలే… సలార్ వసూళ్లపై అనుమానాలు?

ట్రెండింగ్ వార్తలు