శర్వానంద్ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా!

March 6, 2024

శర్వానంద్ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా!

హీరో శర్వానంద్ ఫీల్ గుడ్ జానర్ సినిమాలని ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఒకే ఒక జీవితం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శర్వానంద్ ప్రస్తుతం తన 35వ సినిమాగా శ్రీరామ ఆదిత్య దర్శకత్వంలో హీరోగా మన ముందుకి వస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. ఈరోజు హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు “మనమే” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్.

సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ లో శర్వానంద్ పక్కనే చిన్న బాబు కనిపిస్తున్నాడు. శర్వానంద్ ఆ పిల్లాడివైపు చూస్తూ ఉన్న లుక్ పోస్టర్ అందర్నీ ఆకర్షిస్తోంది. టైటిల్ పోస్టర్ చూసిన వాళ్ళకి ఆ బాబు ఎవరో అనే క్యూరియాసిటీ కలుగుతుంది. కధానుగుణంగా ఈ సినిమా షూటింగ్ లండన్ లో హైదరాబాదులో షూట్ చేశారని సమాచారం. ఈ సినిమా ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో చిన్నారి నేపథ్యంలో సాగే సన్నివేశాలు హైలెట్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు కానీ శర్వానంద్ ఎంగేజ్మెంట్, మ్యారేజ్ పనుల్లో ఉండటంతో సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. వరల్డ్ ఆఫ్ శర్వా పేరుతో వచ్చిన టైటిల్ మేకింగ్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.

ఇక శర్వా 36వ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేసాయి. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ ని పంచుకున్న శర్వానంద్ సాహసం చేసేందుకు సిద్ధంగా ఉండండి అనే క్యాప్షన్ పెట్టారు. ఈ సినిమాకి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. రేసింగ్ ఆధారంగా రూపొందించబడుతున్న ఈ సినిమాలో శర్వానంద్ బైక్ రైడర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

Read More: జనసేన వల్ల టీడీపీకి ఓటమి… యూటర్న్ తీసుకున్న బిగ్ బాస్ శివాజీ?

ట్రెండింగ్ వార్తలు