అంచనాలను పెంచేస్తున్న శర్వానంద్ మనమే టీజర్!

April 19, 2024

అంచనాలను పెంచేస్తున్న శర్వానంద్ మనమే టీజర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటుడు శర్వానంద్ ఒకరు. ఈయన ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు అంతేకాకుండా ఈయన పెళ్లయిన ఏడాది కూడా తిరగకుండానే తండ్రిగా కూడా ప్రమోట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వైవాహిక జీవితంలోను అలాగే వ్యక్తిగత జీవితంలోను శర్వానంద్ ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇకపోతే ఇటీవల శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కొత్త సినిమా అప్డేట్లను కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాకు మనమే అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఇలా మనమే సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

దాదాపు ఈ సినిమా షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా టీజర్ కనుక చూస్తుంటే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజర్ లో శర్వానంద్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. కృతి శెట్టి చాలా గ్లామరస్ గా కనిపించింది. టీజర్ ను చూస్తుంటే డిఫెరెంట్ లవ్ స్టోరీను శ్రీరామ్ ఆదిత్య చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ఈ సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదల చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ గురించి కూడా ప్రకటించబోతున్నారని సమాచారం.

Read More: కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు