అదిరే ఆట..వసూళ్ల వేట బాక్సాఫీస్ బరిలో పోటీకి సై అంటున్న హీరోలు?

March 19, 2024

అదిరే ఆట..వసూళ్ల వేట బాక్సాఫీస్ బరిలో పోటీకి సై అంటున్న హీరోలు?

సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరోలు తెరపై రెండున్నర గంటల పాటు ఓ క్రీడలో నిమగ్నమై ఆట ఆడితే ఎలా ఉంటుంది ప్రేక్షకులకు కనుసొంపుగానే ఉంటుంది ఇలాంటి సినిమాలు కమర్షియల్ పరంగా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటాయి. అందుకే చాలామంది హీరోలు ఈ విధమైనటువంటి క్రీడా నేపథ్యంలో రాబోయే సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో ఆట ఆడటానికి సిద్ధమైనటువంటి హీరోలు ఎవరనే విషయానికి వస్తే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న త్వరలోనే ఈయన బుచ్చిబాబు డైరెక్షన్లో కూడా ఓ సినిమాతో బిజీ కానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆర్ సీ 16 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా ఈనెల 20వ తేది లాంచనంగా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకోనున్నది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాలో రామ్ చరణ్ ఏ క్రీడాకారుడుగా కనిపిస్తాడో తెలియాల్సి ఉంది.

ఇక శర్వానంద్ సైతం ఇటీవల అభిలాష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా కీలక అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు హీరోలు మాత్రమే కాకుండా తమిళ హీరోలు కూడా ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తమిళ హీరో అయినటువంటి ఆర్య సైతం సార్పట్ట సినిమాలో బాక్సర్ గా కనిపించే ప్రేక్షకులను సందడి చేయనున్నారు.

నయనతార ఆర్ మాధవన్ సిద్ధార్థ ప్రధాన పాత్రలలో ఎస్ శశికాంత్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి చిత్రం టెస్ట్ ఈ సినిమా కూడా క్రికెట్ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టైసన్ నాయుడు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో సాయి శ్రీనివాస్ బాక్సర్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇలా ఇటీవల పెద్ద ఎత్తున స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు భారీ స్థాయిలో నిర్మితమవుతున్నాయి. మరి ఈ ఆటలో గెలుపు ఎవరిది అనేది తెలియాల్సి ఉంది.

Read More: చిత్రోత్సవానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరు!

ట్రెండింగ్ వార్తలు