“స్కంద” సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

October 12, 2023

“స్కంద” సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతెనేని లేటెస్ట్ మాస్ యాక్షన్ చిత్రం “స్కంద “. ఈ చిత్రం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ చిత్రం అయితే రామ్ కెరీర్ లో మరో మంచి గ్రాసర్ గా నిలవగా ఇప్పుడు అయితే ఆల్ మోస్ట్ థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకునే స్టేజ్ కి వచ్చేసింది.

ఇక ఈ సమయంలో ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ అయితే తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం ఈ అక్టోబర్ 27న అయితే స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

Read More: `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను` : దర్శకుడు మల్లి

ట్రెండింగ్ వార్తలు