తమ్ముడు పవన్ కోసం రంగంలోకి దిగబోతున్న అన్నయ్య చిరు?

May 7, 2024

తమ్ముడు పవన్ కోసం రంగంలోకి దిగబోతున్న అన్నయ్య చిరు?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన విశ్వంభర సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే చిరంజీవి తన సినిమా పనులకు చిన్నవిరామం ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. చిరంజీవి సినిమాకు విరామం ప్రకటించి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల బరిలోకి రాబోతున్నట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను ఎన్నికలలో గెలిపించి అసెంబ్లీలోకి పంపించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే మెగా అభిమానులు ఫిక్స్ అయ్యారు.ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ కోసం భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తరఫున ఇప్పటికే ఎంతోమంది మెగా హీరోలు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇలా మెగా హీరోలు మాత్రమే కాకుండా జబర్దస్త్ కమెడీయన్స్ అలాగే సీరియల్ ఆర్టిస్టులు అందరూ కూడా పిఠాపురంలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సైతం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు రాబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయం గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం లేదు కానీ తాజాగా చిరు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు అనే వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పిఠాపురం రానున్న నేపథ్యంలో ఆ దిశగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఇది చాలా కీలకము కనుక ఆయన తరపున ప్రచారం చేయడానికి చిరు సిద్ధమయ్యారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి కూడా అధికారక ప్రకటనలేదనే చెప్పాలి.

Read More: ధృవ్ విక్రమ్ తో సినిమా చేయబోతున్న అనుపమ.. టైటిల్ అనౌన్స్?

ట్రెండింగ్ వార్తలు