‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ అప్పుడేనా?

February 17, 2024

‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ అప్పుడేనా?

టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని గురించి అందరికీ తెలిసిందే. తన యాక్టింగ్ తో, తన డాన్స్ తో అందరి దగ్గర మంచి ఇంప్రెషన్ ని కొట్టేసాడు రామ్. కొన్ని సంవత్సరాల క్రితం వరుసుగా హిట్ల మీద హిట్లు కొట్టిన రామ్ పోతినేని ఈ మధ్య కొంచెం డౌన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా విడుదల తర్వాత రామ్ పోతినేనికి హిట్టు అని చెప్పుకునే సినిమాలేవి పడలేదు.

దాని తర్వాత విడుదలైన రెడ్, వారియర్స్, స్కంద సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో రామ్ కెరీర్ డేంజర్ జోన్ లో పడినట్లయింది. ఇదిలా ఉండగా మరోవైపు డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత లైగర్ సినిమాతో పెద్ద డిజాస్టర్ ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి కం బ్యాక్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

వీళ్ళిద్దరూ కాంబోలో మళ్లీ డబల్ ఇస్మార్ట్ సినిమా రాబోతుంది అని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో? హీరోయిన్ ఎవరు అనే ఏ విషయాలు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు చిత్ర బృందం. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా జూన్ 14, 2024న విడుదల కానుంది అని అనౌన్స్ చేశారు చిత్ర బృందం.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ పనిచేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాగా ఇది కూడా బ్లాక్ బస్టర్ అయితే డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కూడా మళ్లీ మంచి ట్రాక్ లో పడతారు. ఎంతైనా ఈ సినిమా విజయం వీళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి అనివార్యం. ఈ విషయం ఇలా ఉండగా మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ గురించి అధికారక సమాచారము రావాల్సి ఉంది.

Read More: సల్మాన్ నటించిన ఆ సినిమాకి రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పారా? అసలు విషయం ఇదే!

ట్రెండింగ్ వార్తలు