థియేటర్లలో ఫ్లాప్.. బుల్లితెరపై హిట్టు కొట్టిన రామ్?

February 13, 2024

థియేటర్లలో ఫ్లాప్.. బుల్లితెరపై హిట్టు కొట్టిన రామ్?

సినిమాల పట్ల ప్రేక్షకుల అభిరుచి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఒక సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ సినిమాని డిజాస్టర్ చేస్తూ ఉంటారు అలాగే డిజాస్టర్ గా మిగిలిపోతుందనుకున్న సినిమాలు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటు ఉంటాయి. ఇలా థియేటర్లలో సక్సెస్ కానీ సినిమాలు బుల్లితెరపై హిట్ అందుకుంటూ ఉంటాయి.

ఈ క్రమంలోనే హీరో రామ్ పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పాలి. ఇటీవల రామ్ హీరోగా నటించినటువంటి సినిమాలలో స్కంద ఒకటి. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ 2023వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బోయపాటి ద్విపాత్రాభినయంలో నటించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా మాత్రం ఘోరంగా పరాజయం అందుకుంది. ఇక ఈ సినిమా థియేటర్లో నడిపించలేకపోయిన ఇటీవల బుల్లితెరపై ప్రసారం కావడంతో బుల్లితెరపై మాత్రం ఊహించిన విధంగా ఆదరణ సొంతం చేసుకుంది.

తాజాగా టీవీలో స్కంద సినిమాకి ఏకంగా 8.47 TRP రేటింగ్ వచ్చింది. ఒక ప్లాప్ సినిమాకి ఈ రేంజ్ రేటింగ్స్ అంటే అది మామూలు విషయం కాదు. ఈ సినిమాతో రామ్ క్రేజ్ ఏంటో మరోసారి తెలుస్తుంది. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా రామ్ ఇదివరకు నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి టీవీల్లో 14.44 రేటింగ్స్ వస్తే, ది వారియర్ లాంటి డిజాస్టర్ మూవీ 10 కి పైగా రేటింగ్స్ రావడం విశేషం. దీన్నిబట్టి బుల్లితెరపై రామ్ సినిమాలకి ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక స్కంద సినిమా భారీ రిజాస్టర్ కావడంతో ఈయన తన తదుపరి సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నారు. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read More: సలార్ 2 కి రంగం సిద్ధం చేస్తున్న ప్రశాంత్.. ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి?

ట్రెండింగ్ వార్తలు