తాప్సీ పన్ను హోమో సెక్సువల్?.. పాయల్ ఘోష్ సంచలన ట్వీట్

December 24, 2023

తాప్సీ పన్ను హోమో సెక్సువల్?.. పాయల్ ఘోష్ సంచలన ట్వీట్

Taapsee Pannu: సినిమా వాళ్లైన, రాజకీయ నాయకులైనా పాపులర్ అయ్యేందుకు రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. కొందరు తమకున్న ఫేమ్ ను నిలబెట్టుకునేందుకు విన్యాసాలు చేస్తే.. మరికొందరు ఫేమ్ లోకి వచ్చేందుకు అలా చేస్తుంటారు. చక్కగా దీనికి ఉదాహరణ అంటే డైరెక్టర్ ఆర్జీవీ. ఈ మధ్యకాలంలో ఈ కోవకు పాయల్ ఘోష్ అనే నటి వచ్చి చేరింది. ప్రతిదానిపై ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటుంది. కొన్ని రోజుల క్రితం సలార్ మూవీపై ట్విట్ చేయగా, ఇప్పుడు తాప్సీ పన్నుపై సంచలన కామెంట్స్ చేసింది.

ఊసరవెల్లి, ప్రయాణం మూవీస్ తో తెలుగు చిత్ర సీమలో పాయల్ ఘోష్ గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఈమెకు పెద్దగా టాలీవుడ్‌లో ఆఫర్లు రాలేదు. అటు బాలీవుడ్ కూడా వెళ్లి ప్రయత్నాలు చేసింది. కొద్దొ గొప్పో సీరియల్స్, సినిమాలు అంటూ ఆఫర్లను రాబట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమెకు నార్త్‌‌లో ఎక్కువ చేదు అనుభవాలే ఎదురైనట్టుగా తెలిసింది. అందుకే ఆమె ప్రతిసారి దక్షిణాది సినీ ఇండస్ట్రీని పొగడ్తలతో ముంచెత్తుతుంది. ఇక్కడే హీరోయిన్లకు అంతో ఇంతో గౌరవం లభిస్తుంటుందని ఆమె చెబుతుంటుంది.

కొద్దికాలం క్రితం ఎన్టీఆర్ మీద మీరా చోప్రా కామెంట్స్ చేసింది. ఆ వివాదంలో పాయల్ ఘోష్ వేలు పెట్టింది. ఎన్టీఆర్ గొప్పదనం చెబుతూ పాయల్ ట్వీట్లు చేసింది. పాయల్ మీద యంగ్ టైగర్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తుండటంతో కాస్త వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భామ ఎన్టీఆర్ జపం చేస్తూ నెట్టింట్లో అంతో ఇంతో వార్తల్లో నిలుస్తూ ఉంది. ఆ తర్వాత అనురాగ్ కశ్యప్ మీద మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా టాప్ హీరోయిన్ తాప్సీ(Taapsee Pannu)పై పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె హోమో సెక్సువల్ అంటూ ట్విట్ చేసింది. అంతేకాకుండా ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉంటే హైదరాబాద్ వాళ్లను అడగండి అని సూచన కూడా చేసింది. దీంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఈ విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. పాయల్ ఘోష్ ఎందుకు ఈ విధంగా చేస్తోందనే ఆలోచనల్లోకి పడేసింది. అందరి అటెన్షన్ తన మీదకు రావాలనే ఉద్దేశంతో ఇలా చేసిందా, లేకా ఆమె నిజంగా హోమో సెక్యువల్ అని తెలియజెప్పేందుకు చేసిందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది..

ఇది కూడా చ‌ద‌వండిRithu Chowdary: అందాలతో జిగేల్ అనిపించేలా రీతూ చౌదరి

ట్రెండింగ్ వార్తలు