అయ్యో తమన్.. మళ్లీ బలి.. స్టేజ్ పర్ఫామెన్స్‌తో ట్రోలింగ్

January 10, 2024

అయ్యో తమన్.. మళ్లీ బలి.. స్టేజ్ పర్ఫామెన్స్‌తో ట్రోలింగ్

మహేష్ బాబు శ్రీ లీల హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ఇటీవల గుంటూరులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.

అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక తమన్ ఇచ్చే మ్యూజిక్ తరచూ కూడా కాపీ ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈయన ఎలాంటి మ్యూజిక్ కంపోజ్ చేసిన కూడా దానిని కాఫీ చేశారు అంటూ ఈయనపై తరచూ ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. ఏకంగా ఈయనని కాపీ క్యాట్ అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఈయన చేసినటువంటి పర్ఫామెన్స్ పై కూడా కాపీ ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ఈయన ఇచ్చినటువంటి ఈ పర్ఫామెన్స్ కి సంబంధించినటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాపీ ట్యూన్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా తమన్ గురించి మరోసారి ట్రోల్స్ మొదలవడంతో పాపం మరోసారి తమన్ బలి అయ్యారంటూ. ఈయన స్టేజ్ పెర్ఫార్మన్స్ పై కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇలా ప్రతి సినిమా విషయంలోనూ తన పట్ల ట్రోల్స్ వస్తున్నప్పటికీ ఈయన మాత్రం తన గురించి వచ్చే ట్రోల్స్ చాలా లైట్ తీసుకుంటారని చెప్పాలి. ఇక గుంటూరు కారం సినిమా విషయంలో కూడా తమన్ భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా కుర్చీ మడత పెట్టే సాంగ్ విషయంలో కూడా ఈయన విమర్శలు పాలయ్యారు.

https://twitter.com/SivaHarsha_23/status/1744731301557792886

Read More: పవన్ కళ్యాణ్ ఓజీ ఎప్పటికీ మాదే.. క్లారిటీ ఇచ్చిన డివివి!

ట్రెండింగ్ వార్తలు