July 4, 2022
షూటింగ్ సెట్స్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఎక్కువగా హీరోలుగా గాయపడటం చూస్తునే ఉంటాం. కానీ ఒకే సినిమా కోసం ఒక హీరో నాలుగైదుసార్లు గాయపడటం మాత్రం చాలా అరుదు. కానీ ఇలాంటి అరుదైన ఓ సంఘటనే జరిగింది కోలీవుడ్‌లో. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ‘లాఠీ’ సినిమా కోసం విశాల్ నాలుగోసారి గాయపడ్డాడు.
రీసెంట్‌గా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో గాయపడిన విశాల్, లేటెస్ట్‌గా హీరో ఇంట్రో యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో గాయాలపాలయ్యారు. గాయపడిన విశాల్‌ను వెంటనే యూనిట్ వర్గాలు హైదరాబాద్‌కు తరలించాయి. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నట్లుగా చెప్పారట వైద్యులు.
ఇక విశాల్ హీరోగా నటిస్తున్న ‘లాఠీ’ సినిమాకు ఎ.వినోద్ కుమార్ దర్శకుడు. సునైన హీరోయిన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు విశాల్ గాయపడటంతో షూటింగ్ వాయిదా పడింది. మరి.. ఆగస్టు 12న రిలీజ్ కావాల్సిన లాఠీ సినిమా రిలీజ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు విశాల్ రీసెంట్ టైమ్స్‌లో ఓ హిట్ కోసం చాలా కష్టపడుతున్నారు. మరి.. లాఠీ సినిమా విశాల్‌కు ఆ లోటును తీర్చాలనే కోరుకుంటున్నారు విశాల్ ఫ్యాన్స్