December 28, 2023
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(Vishal) ఇటీవల న్యూయార్క్ వీధులలో ఒక అమ్మాయితో కలిసి చక్కర్లు కొడుతూ కనిపించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన అమ్మాయితో కలిసి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండగా ఈయనని కొందరు వీడియో తీస్తూ కనిపించారు. అయితే అది గమనించినటువంటి విశాల్(Vishal) దాక్కొని పారిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఎన్నో రకాలుగా కామెంట్లు చేశారు. కొందరు ఈయన పట్ల నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేయగా మరికొందరు ఆమె తన లవర్ అంటూ కూడా కామెంట్లు చేశారు.
ఇలా విశాల్ వీడియో గురించి ఈ విధమైనటువంటి కామెంట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ వీడియో పై స్పందించే క్లారిటీ ఇచ్చారు అందరికీ సారీ చెబుతూ ఈ వీడియో గురించి చెప్పే సమయం ఆసన్నమైంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా విశాల్ ఈ వీడియో పై మాట్లాడుతూ ఈ వీడియో వైరల్ కాగానే నా గురించి చాలామందికి నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చి ఉంటాయని నేను భావించాను.
ఇకపోతే మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏమీ లేదని నాకు అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు కూడా లేరు అని విశాల్ తెలిపారు. ఇక ప్రతి ఏడాది న్యూ ఇయర్ కోసం నేను వేరే దేశానికి వెళుతూ ఉంటాను ఆ నాకు అదొక సాంప్రదాయంగా మారిపోయింది. ఇక ఈసారి కూడా అలాగే వెళ్లానని అయితే నా కజిన్స్ నన్ను ఆట పట్టించడం కోసమే ఇలా చేశారు అంటూ ఈ సందర్భంగా అసలు విషయం బయట పెట్టడంతో కొంతమంది విశాల్ చేసినటువంటి ఈ పోస్ట్ పై స్పందిస్తూ మాకు ముందే తెలుసులేవోయ్ అంటూ కామెంట్ చేశారు
https://x.com/CinemaMadness24/status/1740047295264211153?s=20
Read More: Nivetha Thomas: జమాల్ కుడుకి నివేదా థామస్ స్టెప్పులు..ఇంత లావైందేంటి?