రిపబ్లిక్ డే రోజున `సామాన్యుడు`గా రాబోతున్న విశాల్‌…

November 24, 2021

రిపబ్లిక్ డే రోజున `సామాన్యుడు`గా రాబోతున్న విశాల్‌…

హీరో విశాల్ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సామాన్యుడు’. ఈ  చిత్రంతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయంఅవుతున్నారు. ఇటీవ‌ల‌ విశాల్ బర్త్ డే  సందర్భంగా విడుదల చేసిన సామాన్యుడు ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఈ సినిమాకి ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్లు ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో విశాల్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. డింపుల్ హయతి ఈ చిత్రంలో విశాల్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తుండగా.. కెవిన్ రాజా సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు