23 సంవత్సరాల తర్వాత అజిత్‌తో జోడీ?

August 29, 2022

23 సంవత్సరాల తర్వాత అజిత్‌తో జోడీ?

తమిళ హీరో అజిత్‌ హీరోగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇది అజిత్‌ కెరీర్‌లో 61వ చిత్రం. అయితే అజిత్‌ 62వ సినిమాను నయనతార భర్త, దర్శకుడు విష్నేష్‌ శివన్‌ డైరెక్ట్‌ చేయనున్నారు. అయితే ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు ఇప్పటికే చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. మలయాళ నటి మంజువారియర్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటి ఐశ్వర్యారాయ్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇక ఐశ్యర్యారాయ్‌ ఈ సినిమాకు ఓకే చెబితే కనక అజిత్‌తో ఐశ్వర్య 23 సంవత్సరాల తర్వాత స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నట్లవుతుంది. 2000 ఏడాదిలో రాజీవ్‌ మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కండుకొండైన్‌ కండు కొండైన్‌’ చిత్రంలో అజిత్, టబు, ఐశ్వర్యారాయ్‌ కలిసి నటించారు. ఈ సినిమా అప్పట్లో కమర్షియల్‌గా సక్సెస్‌గా నిలిచింది. ఇప్పుడు అజిత్, ఐశ్వర్యా జోడీ కడతారా? లేట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

ట్రెండింగ్ వార్తలు