వందల కోట్ల ఆస్తి ఉన్న రాజమౌళి ఆ పని మాత్రం చేయ్యారా?

April 3, 2024

వందల కోట్ల ఆస్తి ఉన్న రాజమౌళి ఆ పని మాత్రం చేయ్యారా?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులుగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా గ్లోబల్ స్థాయిలో కూడా ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన తన సినీ ప్రయాణాన్ని బుల్లితెరపై ప్రారంభించారు. ఇలా బుల్లితెరపై ప్రారంభమైనటువంటి తన ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఇలా అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి అని చెప్పాలి.

ఈయన దర్శకత్వంలో వచ్చింది కేవలం 12 సినిమాలు అయినప్పటికీ ఈ 12 సినిమాలు సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ కావడం విశేషం ఈ 12 సినిమాల నిర్మాతలు ఎవరో కూడా నష్టపోయినటువంటి దాఖలాలు లేవు. అంత అద్భుతంగా రాజమౌళి ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు కనుక ఈయనతో ఒక సినిమా అయినా చేయాలని ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఆరాటపడుతూ ఉంటారు.

ఇలా అద్భుతమైనటువంటి సూపర్ హిట్ సినిమాలను చేసినటువంటి డైరెక్టర్ రాజమౌళి వందల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించారు. పలు నివేదికల ప్రకారం ఈయన ఆస్తుల విలువ సుమారు 400 కోట్ల వరకు ఉంటుందని అంచనా ఇలా వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ రాజమౌళి మాత్రం ఒక రూపాయి కూడా ధైర్యం చేసి ఖర్చులు పెట్టరని తెలుస్తోంది.

డబ్బు విలువ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో డబ్బుకు గౌరవం ఇస్తూ ప్రతి రూపాయి రూపాయి కూడా పెడుతూ వచ్చారు. సాధారణంగా ఏ సెలబ్రెటీ కైనా స్టార్డం వస్తే పెద్ద ఎత్తున పబ్బులు పార్టీలు అంటూ డబ్బులను ఖర్చు పెడతారు కానీ రాజమౌళి మాత్రం పొరపాటున కూడా ఇలా పార్టీలకు పబ్బులకు డబ్బు అసలు ఖర్చు చేయరని తెలుస్తుంది. ఇలా సినిమాలలో సంపాదించిన డబ్బు మొత్తం ఈయన సేవింగ్స్ చేస్తూ ఈ స్థాయిలో ఆస్తులను కూడ పెట్టారని సమాచారం.

Read More: నా కొడుకుకు అందుకే తారక్ అని పేరు పెట్టాను.. నందు కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు