బాల‌య్య మాస్ జాత‌ర `అఖండ` ఓటీటీలో వ‌చ్చేది ఎప్పుడంటే..?

December 30, 2021

బాల‌య్య మాస్ జాత‌ర `అఖండ` ఓటీటీలో వ‌చ్చేది ఎప్పుడంటే..?

Akhanda OTT: న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అఖండ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే.. గ‌త కొంత కాలంగా త‌మ హీరోను మాంచి మాస్ మూవీలో చూడాలి అనుకున్న నంద‌మూరి అభిమానుల‌కు ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టేసింది. దీంతో ఈ చిత్రానికి ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు భారీగా వచ్చాయి. దీంతో అంతలా జై బాలయ్య అనే మాటే వినిపిస్తూ వచ్చింది. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి ‘అఖండ’ మూవీకి ఆరంభం నుంచే మంచి రెస్పాన్స్ దక్కుతూ వచ్చింది. ఫలితంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ బిజినెస్‌ను దాటి కలెక్షన్లను రాబట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. అలాగే, శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానెల్ భారీ ధరకు కొనుగోలు చేసింది.

ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ కూడా రివీల్ అయింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫిబ్రవరి 27న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కాబోతుందట‌.

ట్రెండింగ్ వార్తలు