#NBK107: మాస్ అండ్ ర‌గ్డ్ లుక్‌లో బాల‌య్య పండుగ‌ చేసుకుంటున్న ఫ్యాన్స్‌

February 21, 2022

#NBK107: మాస్ అండ్ ర‌గ్డ్ లుక్‌లో బాల‌య్య పండుగ‌ చేసుకుంటున్న ఫ్యాన్స్‌
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ, గోపిచంద్ మ‌లినేనిల ఫ‌స్ట్ క్రేజీ కాంబినేష‌న్‌లో ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఓ భారీ చిత్రం (#NBK107) రూపొందుతోంది. ఈ యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో బాల‌య్య‌ను ఇంత వ‌రకు చూడని స‌రికొత్త రూపంలో చూపించ‌నున్నాడు ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని.
తాజాగా #NBK107 లో బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఈ లుక్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుతో పాటు రగ్డ్ లుక్‌లో మెడపై రుద్రాక్ష మాలతో  బాలకృష్ణ స్టైలిష్‌గా నడుచుకుంటూ వ‌స్తున్నారు, ఈ  పోస్టర్‌లో నల్ల చొక్కా మరియు గోధుమ రంగు పంచె ధరించాడు. క్యారెక్ట‌ర్‌కు మరింత ఎలివేషన్ ఇచ్చే వాచ్, ఉంగరాలు, షేడ్స్ వంటి వాటిని కూడా పోస్ట‌ర్లో మ‌నం చూడొచ్చు.బాల‌కృష్ణ స‌ర‌స‌న శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ ద్వారా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్  తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ ని ఎంపిక చేసుకున్నారు.
థమన్ సంగీతం అందిస్తుండ‌గా రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్  రాస్తున్నారు, నేషనల్ అవార్డ్ విన్నిర్‌ నవీన్ నూలి ఎడిట‌ర్‌,  ఏఎస్‌  ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
ReadMore: Samantha Ruth Prabhu: శకుంతలగా సమంత

ట్రెండింగ్ వార్తలు